నీరవ్‌కు నాలుగోసారి బెయిల్ నిరాకరణ.. ఇక జైలుకేనా..?

Nirav modi, నీరవ్‌కు నాలుగోసారి బెయిల్ నిరాకరణ.. ఇక జైలుకేనా..?

పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్లు ఎగనామం పెట్టి పరారీలో ఉన్న ప్రముఖ వజ్రాల వ్యాపారవేత్త నీరవ్ మోదీకి లండన్‌ కోర్టులో నాలుగోసారి బెయిల్ నిరాకరించబడింది. అతడికి బెయిల్ ఇస్తే ఈ కేసులో సాక్షాలను నాశనం చేసే అవకాశం ఉందని ఎప్పటినుంచో వాదిస్తోన్న భారత్ తరపు న్యాయవాదులు.. దానికి చెందిన ఆధారాలను న్యాయస్థానానికి సమర్పించారు. వాటిని పరిగణలోకి తీసుకున్న లండన్ కోర్టు అతడికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. మరోవైపు ఈ కేసులో నీరవ్‌ను లండన్ ప్రభుత్వం భారత్‌కు అప్పగించాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ నీరవ్‌ను భారత్‌కు అప్పగిస్తే అతడిని ఉంచేందుకు ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలు సిద్ధమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *