Breaking News
  • తూ.గో: పెద్దాపురంలో దారుణం. యర్రా శివశంకర్‌ అనే వ్యక్తిపై నగేష్‌ కత్తితో దాడి. పరిస్థితి విషమం, కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలింపు.
  • అమరావతి: ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశారు. ప్రలోభాలకు లొంగలేదనే మండలి రద్దు తీర్మానం చేశారు. సెలెక్ట్‌ కమిటీ అంటే జగన్‌కు ఎందుకంత భయం. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ఎందుకు విచారణ జరపలేదు -ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు.
  • మద్దాల గిరిని ఆర్థికంగా బెదిరించి పార్టీలోకి లాక్కున్నారు.
  • 11 మంది భారతీయ మత్స్యకారులను బంధించిన శ్రీలంక. ఒక పడవను స్వాధీనం చేసుకున్న శ్రీలంక నేవీ సిబ్బంది.
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 8 గంటల సమయం. 16 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు. ఈ రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.02 కోట్లు. ఈ రోజు శ్రీవారిని దర్శించుకున్న 44,366 మంది భక్తులు.
  • సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌ బదిలీ. అమోయ్‌ కుమార్‌ను రంగారెడ్డి జిల్లాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు. నేరేడుచర్ల ఇంచార్జి కమిషనర్‌ మహేందర్‌రెడ్డి సస్పెన్షన్‌. తహశీల్దార్‌ రాంరెడ్డికి ఇంచార్జి బాధ్యతలు. కేవీపీ ఓటు విషయంలో అధికారుల తీరుపై ప్రభుత్వం చర్యలు.

నీరవ్ మోదీ బంగ్లాను డైనమైట్స్‌తో పేల్చేసిన అధికారులు

, నీరవ్ మోదీ బంగ్లాను డైనమైట్స్‌తో పేల్చేసిన అధికారులు

మహారాష్ట్ర : పంజాబ్ నేషనల్ బ్యాంకుకు కుచ్చుటోపీ పెట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న ఆర్థిక నేరగాడు నీరవ్ మోడీ బంగ్లా ను అధికారులు కుప్పకూల్చేశారు. ఆయన ఎంతో ఇష్టంగా కట్టుకున్న అలీబాగ్‌లోని బంగ్లాను రాయగడ్ జిల్లా కలెక్టర్ సమక్షంలో అధికారులు నేలమట్టం చేశారు. సాధారణంగా బుల్‌డోజర్లతో అక్రమ నిర్మాణాల్ని, కట్టడాల్ని అధికారులు తొలగిస్తుంటారు. కానీ నీరవ్ మోదీ బంగ్లా కూల్చేందుకు మాత్రం అధికారులు 100 డైనమైట్లు వినియోగించి బంగ్లాను పడగొట్టారు. భవనానికి రంధ్రాలు చేసి డైనమైట్ అమర్చి పేల్చేశారు. రిమోట్‌ కంట్రోల్ సాయంతో దీన్ని ఆపరేట్‌ చేశారు. దీని వల్ల ఎటువంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకున్నారు.

, నీరవ్ మోదీ బంగ్లాను డైనమైట్స్‌తో పేల్చేసిన అధికారులు , నీరవ్ మోదీ బంగ్లాను డైనమైట్స్‌తో పేల్చేసిన అధికారులు

నీరవ్ మోదీ ఈ బంగ్లాను 33 వేల చదరపు అడుగుల స్థలంలో నిర్మించారు. దీని విలువ రూ.100 కోట్లకు పైనే ఉంటుంది. అయితే తీరప్రాంత రెగ్యులేటరీ నిబంధనలను ఉల్లంఘించి బంగ్లాను నిర్మించారని అధికారులు గుర్తించారు. దీంతో అధికారులు ఈ విలాసవంత బంగ్లాతో పాటు.. బయట ఉన్న తోటను కూడా ధ్వంసం చేశారు. గత కొన్నిరోజులుగా మహారాష్ట్రలోని అలీబాగ్‌లో ఉన్న నీరవ్ మోదీ బంగ్లాను కూల్చేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ పునాది చాలా పటిష్టంగా ఉండటంతో కేవలం బుల్ డోజర్లతో కూల్చలేకపోయారు. దీంతో ముందుగా బంగ్లా చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న గదులను నేలమట్టం చేశారు. ఈ భవనాన్ని అక్రమంగా, కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని అధికారులు స్పష్టం చేశారు.