ఉగ్రదాడి.. ప్రధాని నివాసంలో అత్యవసర భేటీ

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో గురువారం జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ప్రధాని నివాసంలో అత్యవసరంగా సమావేశమైంది. ఈ భేటీకి హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. వారితో పాటు త్రివిధ దళాధిపతులు, సీర్పీఎఫ్ డీజీ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఉగ్రదాడి నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లో చేపట్టాల్సిన భద్రతా చర్యల గురించి సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. భేటీ […]

ఉగ్రదాడి.. ప్రధాని నివాసంలో అత్యవసర భేటీ
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 8:27 PM

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో గురువారం జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ప్రధాని నివాసంలో అత్యవసరంగా సమావేశమైంది. ఈ భేటీకి హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. వారితో పాటు త్రివిధ దళాధిపతులు, సీర్పీఎఫ్ డీజీ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.

ఉగ్రదాడి నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లో చేపట్టాల్సిన భద్రతా చర్యల గురించి సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. భేటీ అనంతరం హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ రోజు కశ్మీర్ వెళ్లనున్నారు. దాడి జరిగిన ప్రాంతాన్ని ఆయన స్వయంగా పరిశీలించనున్నారు. కాగా గురువారం జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో 44మంది జవాన్లు మరణించగా.. మరికొందరు గాయపడ్డ విషయం తెలిసిందే.