మోదీ ఆస్తుల విలువ ఎంతంటే… 

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వారణాసి నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్న ప్రధాని నరేంద్రమోదీ నేటి మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ చీఫ్ అమిత్ షా, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే సహా ఎన్డీయే నేతలు, కేంద్రమంత్రులు వెంట రాగా కలెక్టరేట్‌లో మోదీ నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో మోదీ తన మొత్తం ఆస్తుల విలువను రూ.2.51 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో చరాస్తి రూ.1,41,36,119 కాగా, స్థిరాస్తి […]

మోదీ ఆస్తుల విలువ ఎంతంటే... 
Follow us

| Edited By:

Updated on: Apr 26, 2019 | 9:39 PM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వారణాసి నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్న ప్రధాని నరేంద్రమోదీ నేటి మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ చీఫ్ అమిత్ షా, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే సహా ఎన్డీయే నేతలు, కేంద్రమంత్రులు వెంట రాగా కలెక్టరేట్‌లో మోదీ నామినేషన్ పత్రాలు సమర్పించారు.

ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో మోదీ తన మొత్తం ఆస్తుల విలువను రూ.2.51 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో చరాస్తి రూ.1,41,36,119 కాగా, స్థిరాస్తి విలువను రూ.1.10 కోట్లుగా చూపించారు.

2014లో మోదీ తన చరాస్తి విలువను రూ.65,91,582 గా పేర్కొనగా ఈ ఐదేళ్లలో అవి ఏకంగా 114.15 శాతం పెరిగాయి. మోదీ తన ప్రధాన ఆదాయ వనరుగా తన వేతనాన్ని, సేవింగ్స్‌పై వస్తున్న వడ్డీని చూపించారు. ఇక, తనపై ఎటువంటి క్రిమినల్ కేసులు లేవని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి తన చేతిలో రూ.38,750 ఉందని తెలిపారు. తన బ్యాంకు బ్యాలెన్స్‌ను రూ.4,143గా పేర్కొన్న మోదీ.. రూ.1,27,81,574 (రూ.1.27 కోట్లు) భారతీయ స్టేట్ బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపేణా ఉందని వివరించారు.

2014లో మోదీ చేతిలో రూ.32,700 నగదు ఉండగా, బ్యాంకు బ్యాలెన్స్ రూ.26.05 లక్షలు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల విలువ రూ.32.48 లక్షలు. అలాగే, ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ.1,13,800 విలువైన నాలుగు బంగారు ఉంగరాలు (45 గ్రాములు) ఉన్నట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 2014లో వీటి విలువ సుమారు రూ.1.35 లక్షలు. ఇక చదువు విషయానికొస్తే, మోదీ 1978లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి డిగ్రీ, 1983లో అహ్మదాబాద్‌లోని గుజరాత్ యూనివర్సిటీ నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్టు పేర్కొన్నారు.

మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!