ఆంధ్రప్రదేశ్ కు అవార్డులు: వర్చువల్ పద్దతిలో ప్రధాని నరేంద్రమోదీ ప్రధానం, అందుకున్న సీఎం వైఎస్ జగన్

PMAY పీఎంఏవై ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్‌), ఆశా - ఇండియా అవార్డుల కార్యక్రమం కొత్త ఏడాది తొలిరోజున జరిగింది...

ఆంధ్రప్రదేశ్ కు అవార్డులు: వర్చువల్ పద్దతిలో ప్రధాని నరేంద్రమోదీ ప్రధానం,  అందుకున్న సీఎం వైఎస్ జగన్
Follow us

|

Updated on: Jan 01, 2021 | 4:22 PM

PMAY పీఎంఏవై ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్‌), ఆశా – ఇండియా అవార్డుల కార్యక్రమం కొత్త ఏడాది తొలిరోజున జరిగింది. వర్చువల్‌ పద్దతిలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా పలు అవార్డులు అందుకున్నారు. పీఎంఏవై అర్బన్‌ ఇళ్లనిర్మాణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌కు 3వ ర్యాంకు వచ్చినందుకు ఒక అవార్డు లభించగా, బెస్ట్‌ప్రాక్టీస్, ఇన్నోవేషన్‌ ప్రత్యేక కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ రెండు అవార్డులు సొంతం చేసుకుంది. బెస్ట్‌ప్రాక్టీస్, ఇన్నోవేషన్‌ ప్రత్యేక కేటగిరీలో ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ విధానాలు, టూల్స్‌ వాడుతున్నందుకు ఏపీకి రెండో ర్యాంకు చిక్కింది. ఇక, బెస్ట్‌ప్రాక్టీస్, ఇన్నోవేషన్‌ ప్రత్యేక కేటగిరీలో ఉత్తమ టెక్నాలజీకిగాను ఏపీకి 3వ ర్యాంకు సిద్ధించింది. ఉత్తమ సమర్థత చూపిన మున్సిపల్‌ కార్పొరేషన్‌ విభాగంలో గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌కు మొదటి ర్యాంకు రావడం విశేషం. వర్చువల్‌ విధానంలో ప్రధాని నరేంద్రమోదీ అవార్డులను ప్రదానం చేయగా, ఆంధ్రప్రదేశ్ అవార్డులను సీఎం వైయస్‌ జగన్మోహన్ రెడ్డి అందుకున్నారు.

24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు