అర్నాబ్ గోస్వామి వాట్సాప్ చాటింగ్ పై దర్యాప్తు ఎందుకు జరపరు ? ప్రధాని మోదీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్న

2019 నాటి బాలాకోట్ వైమానిక దాడులకు సంబంధించి రిపబ్లిక్ టీవీ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామికి, మరొకరికి మధ్య నడిచిన వాట్సాప్ సంభాషణపై మీరు ఎందుకు దర్యాప్తు జరపరని..

అర్నాబ్ గోస్వామి వాట్సాప్ చాటింగ్ పై దర్యాప్తు ఎందుకు జరపరు ? ప్రధాని మోదీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్న
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 19, 2021 | 5:30 PM

2019 నాటి బాలాకోట్ వైమానిక దాడులకు సంబంధించి రిపబ్లిక్ టీవీ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామికి, మరొకరికి మధ్య నడిచిన వాట్సాప్ సంభాషణపై మీరు ఎందుకు దర్యాప్తు జరపరని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సూటిగా ప్రధాని మోదీని ప్రశ్నించారు. అధికారిక రహస్యాలను ఓ జర్నలిస్టుకు ఇవ్వడం క్రిమినల్ చర్య అన్నారు. ఈ సంభాషణ లీక్ అయినందుకు మీదే బాధ్యత అని, ఈ సమాచారాన్ని ఎవరు లీక్ చేశారన్న దానిపై మీరు ఇన్వెస్టిగేషన్ ఎందుకు జరపలేదని అన్నారు. ఈ దాడుల గురించి కేవలం ప్రధానికి, హోం మంత్రికి, రక్షణ మంత్రికి, డిఫెన్స్, ఎయిర్ ఫోర్స్,  ఆర్మీ చీఫ్ లకు మాత్రమే తెలిసి  ఉండాలన్నారు.అధికారిక రహస్యాలను లీక్ చేయడం దేశ వ్యతిరేక చర్య అవుతుందన్నారు. అర్నాబ్ కు ఎవరు సమాచారం అందించారో తెలుసుకోగోరుతున్నామని రాహుల్ అన్నారు. మోదీయే ఇచ్చారా లేక హోం మంత్రా అన్నారు.

2019 ఫిబ్రవరి 23 న ఈ దాడులపై అర్నాబ్ గోస్వామికి, టీవీ రేటింగ్స్ ఏజన్సీ మాజీ సీఈఓ  పార్థో దాస్ గుప్తాకు మధ్య వాట్సాప్ లో సంభాషణ జరిగింది. ఆ తరువాత మూడు రోజులకే ఈ ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయి. నిన్నటికి నిన్నశివసేన నేత సంజయ్ రౌత్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఆయన కూడా ఇది నేషనల్ సెక్యూరిటీకి ముప్పు కలిగించే అంశమన్నారు.