విపక్షాలకు కావాల్సింది ఓల్డ్ ఇండియా.. మోదీ ఎద్దేవా..

రాజ్యసభలో కాంగ్రెస్‌పై విమర్శల వర్షం కురిపించారు ప్రధాని మోదీ. ఎన్నికల్లో ఓటమిని హుందాగా స్వీకరించని కాంగ్రెస్ నేతలు ఈవీఎంలను సాకుగా చూపించడం దారుణమన్నారు. తమ ఓటమికి ఈవీఎంలను నిందించడం విపక్షాలకు ఓ రోగంగా మారిందని ఆరోపించారు. కాంగ్రెస్ గెలిస్తేనే గెలిచినట్టు.. లేకుంటే విజయమే కాదన్న భావన ఆ పార్టీ నేతల్లో ఉందని, అహంకారం హద్దుల్లో ఉంచుకోవాలన్నారు. విపక్షాలు న్యూ ఇండియా కాదు.. ఓల్డ్ ఇండియాను కోరుకుంటున్నాయని విమర్శించారు. ఆధార్‌ను తీసుకొచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు వ్యతిరేకించడం విడ్డూరంగా ఉందన్నారు. […]

విపక్షాలకు కావాల్సింది ఓల్డ్ ఇండియా.. మోదీ ఎద్దేవా..
Follow us

| Edited By: Srinu

Updated on: Jun 26, 2019 | 4:57 PM

రాజ్యసభలో కాంగ్రెస్‌పై విమర్శల వర్షం కురిపించారు ప్రధాని మోదీ. ఎన్నికల్లో ఓటమిని హుందాగా స్వీకరించని కాంగ్రెస్ నేతలు ఈవీఎంలను సాకుగా చూపించడం దారుణమన్నారు. తమ ఓటమికి ఈవీఎంలను నిందించడం విపక్షాలకు ఓ రోగంగా మారిందని ఆరోపించారు. కాంగ్రెస్ గెలిస్తేనే గెలిచినట్టు.. లేకుంటే విజయమే కాదన్న భావన ఆ పార్టీ నేతల్లో ఉందని, అహంకారం హద్దుల్లో ఉంచుకోవాలన్నారు. విపక్షాలు న్యూ ఇండియా కాదు.. ఓల్డ్ ఇండియాను కోరుకుంటున్నాయని విమర్శించారు. ఆధార్‌ను తీసుకొచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు వ్యతిరేకించడం విడ్డూరంగా ఉందన్నారు. ఆధార్, ఈవీఎం, డిజిటల్ ఇండియాను కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకిస్తుందో అర్థం కావడంలేదన్నారు మోదీ.