సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్…నేటి కీల‌క అంశాలు

దేశంలో కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌ సడలింపు, ప్రజా రవాణా, ఆర్థిక పరిస్థితుల వంటి అంశాలపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ‌ మరోసారి ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. ఈ రోజు మధ్యా హ్నం 3 గంటలకు ఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మోడీ సీఎంలతో మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రాల వారీగా కోవిడ్‌ నివారణకు చేపడుతున్న చర్యలను మోడీ తెలుసుకోనున్నా రు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం పలు సూచనలు, సలహాలు కూడా ఇవ్వనున్నారు మోదీ.  […]

సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్...నేటి కీల‌క అంశాలు
Follow us

|

Updated on: May 11, 2020 | 8:26 AM

దేశంలో కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌ సడలింపు, ప్రజా రవాణా, ఆర్థిక పరిస్థితుల వంటి అంశాలపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ‌ మరోసారి ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. ఈ రోజు మధ్యా హ్నం 3 గంటలకు ఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మోడీ సీఎంలతో మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రాల వారీగా కోవిడ్‌ నివారణకు చేపడుతున్న చర్యలను మోడీ తెలుసుకోనున్నా రు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం పలు సూచనలు, సలహాలు కూడా ఇవ్వనున్నారు మోదీ.  ఇప్పటికే నిర్ణీత ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుండి రాత్రి 7 గంటల వరకూ దుకాణాలు తెరిచేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌ నుండి ప్రజా జీవితాన్ని చిన్నచిన్నగా ప్రారంభించేందుకు కేంద్రం అడగులేస్తోంది. ఈనేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ ఈనెల 17తో ముగియనున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇంతకు ముంది మార్చి 20, ఏప్రిల్ 2, ఏప్రిల్ 11, ఏప్రిల్ 27న సీఎంతలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. కాగా, మూడో ద‌శ లాక్‌డౌన్ ముగింపు నేప‌థ్యంలో ఇవాళ్టి స‌మావేశం మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారింది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 60 వేలు దాటిన తరుణంలో ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ప్ర‌ధాని చేసే ప్ర‌క‌ట‌న‌పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.
అయితే,  గతంలో కేవలం ప్రధాని ఒక్కరే వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనగా, ఈసారి ఈ కార్యక్రమానికి ప్రధానితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య శాఖ మంత్రి, వైద్య శాఖ కార్యదర్శి, హోం మంత్రి, హోం శాఖ కార్యదర్శి కూడా హాజరుకానున్నారు. అలాగే గతంలో కేవలం 9 మంది ముఖ్యమంత్రులతోనే ప్రదాని వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడగా ఈసారి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతోనూ సుదీర్ఘంగా చర్చించనున్నారు.
ప్ర‌ధానంగా చ‌ర్చించే కీల‌క అంశాలుః *  రాష్ట్రాల్లో పర్యటించిన కేంద్ర బృందాల సూచనల్ని ప్రధాని మోదీ ప‌రిశీలిస్తారు.

*  వలస కార్మికుల అంశం, విదేశాల నుంచి తిరిగి వస్తున్న వారికి క్వారంటైన్ అంశాలపై చర్చ

*  మే 18 నుంచి మరిన్ని వెసులుబాట్లు, మినహాయింపులూ కల్పిస్తూ… లాక్‌డౌన్ కొనసాగించే అవకాశాలున్నాయి.

*  అలాగే జూన్‌ ప్రారంభం నుండే ప్రజా రవాణాను అందుబాటులోకి తెచ్చే అంశంపై కూడా చ‌ర్చించ‌నున్నారు.

ఆదివారం రాష్ట్రాల సీఎస్‌లు, ఆరోగ్య కార్యదర్శులతో… కేంద్ర కేబినెట్ సెక్రెటరీ రాజీవ్ గుహ వీడియో కాన్ఫరెన్స్ జరిపారు. సంబంధిత‌ రిపోర్ట్ కీలకం కానుంది.
లాక్‌డౌన్ నేప‌థ్యంలో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రాన్ని కోరుతున్నారు. దీనిపై కూడా కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?