Breaking News
  • కేంద్రమంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌కు చంద్రబాబు లేఖ. నరేగా పెండింగ్‌ నిధులను వెంటనే విడుదల చేయాలని వినతి. ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ.. నిధులు విడుదల చేయకుండా పెండింగ్‌లో ఉంచింది. గతంలో నరేగా పనులు చేసినవారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది -లేఖలో చంద్రబాబు.
  • పదేళ్లలో జమ్మికుంట-హుజూరాబాద్‌ నగరాలు కలిసిపోతాయి. జంట నగరాలకు మున్సిపల్ చైర్మన్లుగా టీఆర్‌ఎస్ అభ్యర్థులే గెలుస్తారు. ఎన్నికల్లో ఓడిపోయినా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా.. కేసీఆర్‌ నన్ను నియమించారు-వినోద్‌కుమార్‌. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలి -ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్.
  • కడప: పోరుమామిళ్ల మండలం మార్కాపురం దగ్గర గుర్తుతెలియని వాహనం ఢీకొని సిలాస్‌ అనే వ్యక్తికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • నగరపాలక, మున్సిపల్‌ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తిచేశాం. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో రేపు ఓట్ల లెక్కింపు. ఈ నెల 27న మేయర్లు, చైర్‌పర్సన్ల ఎన్నికకు పరోక్ష ఎన్నికలు. ఈనెల 29న కరీంనగర్‌ మేయర్‌ ఎన్నిక-నాగిరెడ్డి. రేపు సాయంత్రంలోగా అన్ని ఫలితాలు వస్తాయి. పార్టీలు మేయర్‌, చైర్‌పర్సన్ల పేర్లను ఏ, బీ ఫారాల ద్వారా ఇవ్వాలి. ఈ నెల 26న ఉ.11 గంటలలోగా ఏ ఫామ్‌ ఇవ్వాలి. ఈ నెల 27న ఉ.11 గంటలలోగా బీ ఫామ్‌ ఇవ్వాలి -తెలంగాణ ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి.
  • శాసనమండలి తీరుపై ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ ఆగ్రహం. మంచి వ్యక్తితో తప్పుడు పనిచేయించిన చంద్రబాబును ఎవరూ క్షమించరు. వైసీపీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయమని అడిగే హక్కు టీడీపీకి లేదు. ముందు టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి.. ఎన్నికలకు వెళ్లాలి -ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్.

నేడు జాతీయ యుద్ధ స్మారకాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ

, నేడు జాతీయ యుద్ధ స్మారకాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ

న్యూఢిల్లి : దేశ రక్షణలో అసువులుబాసిన అమరవీరుల కోసం ఢిల్లీలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన జాతీయ యుద్ధ స్మారకాన్ని ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభించనున్నారు. ప్రత్యేకంగా రూపొందిన ఒక రాతి స్తంభం కింది భాగంలో ఏర్పాటు చేసిన వేదికలో జ్వాలను వెలిగిస్తారు. ఈ జ్వాల నిరంతరంగా కొనసాగుతుంది. స్వాతంత్య్రం వచ్చాక దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల పట్ల దేశం చూపుతున్న కృతజ్ఞతకు ఇది నిదర్శనమని సమీకృత రక్షణ బలగాల అధిపతి లెఫ్టినెంట్‌ జనరల్‌ పి.ఎస్‌.రాజేశ్వర్‌ తెలిపారు.

, నేడు జాతీయ యుద్ధ స్మారకాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ

ఢిల్లీలోని ‘ఇండియా గేట్‌ ప్రాంగణంలోని 40 ఎకరాల్లో దీన్ని నిర్మించారు. చక్రవ్యూహం స్ఫూర్తితో రూపొందిన ఈ స్మారకాన్ని రూ.176 కోట్లతో నిర్మించారు. అంతర్జాతీయ స్థాయిలో దీని డిజైన్‌ను ఎంపిక చేశారు. సువిశాలమైన ఈ ప్రాంగణంలోని మధ్యభాగం కిందకి దిగి ఉంటుంది. చారిత్రక ఇండియా గేట్‌ ఘన వారసత్వాన్ని గౌరవించేందుకు ఈ చర్య చేపట్టారు. ఇందులోని 16 గోడలపై 25,942 మంది అమరవీరుల పేర్లు, వారి హోదా, రెజిమెంట్‌ వివరాలు ఉంటాయి. గ్రానైట్‌ రాతిపై ఇవి కనిపిస్తాయి. నాలుగు వృత్తాలు ఉంటాయి. వాటికి అమర్‌ చక్ర, వీరతా చక్ర, త్యాగ్‌ చక్ర, రక్షక్‌ చక్రగా పేర్లు పెట్టారు. మధ్యలో ఉండే పొడవైన స్తంభంపై అశోకుడి మూడు సింహాల చిహ్నం ఉంటుంది. పరమయోధ స్థల్‌ అనే చోట దేశ అత్యున్నత సైనిక పురస్కారం ‘పరమ్‌వీర్‌ చక్ర’ పొందిన 21 మంది విగ్రహాలు ఉంటాయి.

, నేడు జాతీయ యుద్ధ స్మారకాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ