ప్రధాని ‘పూజోర్ శుబేచా’.. బెంగాల్‌ ప్రజలనుద్దేశించి ప్రసంగం

నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి మోదీ గురువారం మధ్యాహ్నం 12గంటలకు పశ్చిమ బెంగాల్‌ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.

ప్రధాని ‘పూజోర్ శుబేచా’.. బెంగాల్‌ ప్రజలనుద్దేశించి ప్రసంగం
Follow us

|

Updated on: Oct 22, 2020 | 8:39 AM

నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి మోదీ గురువారం మధ్యాహ్నం 12గంటలకు పశ్చిమ బెంగాల్‌ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. డిజిటల్ వేదికగా జరుగుతున్న ప్రసంగానికి ఇందుకు ఆ రాష్ట్ర బీజేపీ శాఖ విస్తృతమైన ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో 294 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రతి పోలింగ్‌ బూత్‌లో పీఎం మోదీ వర్చువల్‌ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని సంకల్పించింది. సుమారు 78వేలకుపైగా పోలింగ్‌ కేంద్రాల్లోని ప్రతి బూత్‌లో 25 మందికిపైగా పార్టీ కార్యకర్తలు, ఓటర్లు ప్రసంగాన్ని వినేలా ఏర్పాట్లు చేసింది బెంగాల్ బీజేపీ రాష్ట్ర శాఖ.

ప్రధాని ‘పూజోర్ శుబేచా’ (పూజా శుభాకాంక్షలు), కరోనా నేపథ్యంలో మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం తదితర అంశాలపై ఆ రాష్ట్ర ప్రజలతో అభిప్రాయాలను పంచుకోనున్నారు. ప్రధానమంత్రి ప్రసంగం సందర్భంగా, పశ్చిమ బెంగాల్ బీజేపీ సీనియర్ నాయకుల సమక్షంలో గురువారం ఉదయం 10 గంటల నుండి కోల్‌కతాలోని తూర్పు జోనల్ కల్చరల్ సెంటర్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని లైవ్‌ టెలికాస్ట్‌కు ఆ పార్టీ ఏర్పాటు చేసింది.

వచ్చే ఏడాదిలో పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేసే దిశ రాష్ట్ర నాయకత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌, బీజేపీ మధ్యల ప్రధాన పోటీ నెలకొంది. 2019 లోక్‌సభ బీజేపీ 22 ఎంపీ సీట్లు గెలుపొందగా, అధికార పార్టీ 18 సీట్లకే పరమితమైంది. ఇక, ఓట్ల శాతం విషయంలోనూ అధికార పార్టీని మూడు శాతం వెనక్కి నెట్టింది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాషాయ జెండా ఎగుర వేయాలని బీజేపీ అధి నాయకత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రజలను ఆకట్టుకునేందుకు ఉపక్రమించింది. ప్రధాని మోదీ ప్రసంగం ద్వారా బెంగాల్ ప్రజలకు మరింత దగ్గర కావాలని భావిస్తోంది.

ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..