ప్రధాని మోదీ తిరుమల టూర్ సమగ్ర విశేషాలు

Picture

ప్రధాని మోదీ తిరుపతి పర్యటన

ముగిసిన ప్రధాని తిరుపతి పర్యటన

09/06/2019,10:23PM
Picture

ప్రధాని తిరుపతి పర్యటన

ప్రధానికి వీడ్కోలు పలికిన సీఎం జగన్, గవర్నర్, రాష్ట్ర మంత్రులు.

09/06/2019,10:23PM
Picture

ప్రధాని తిరుపతి పర్యటన

రేణిగుంట విమానాశ్రయం చెరుకున్న ప్రదాని మోడీ, సీఎం జగన్, గవర్నర్ నరసింహన్.

09/06/2019,10:21PM
Picture

ప్రధాని తిరుపతి పర్యటన

తిరుమల నుంచి ఒకే వాహనంలో ఎయిర్ పోర్ట్ కు చేరిన ప్రధాని, సీఎం, గవర్నర్.

09/06/2019,10:20PM
Picture

తిరుమలలో ప్రధాని మోదీ, ఏపీ సీఎం జగన్ భేటీ

లోటు బడ్జెట్‌కి సంబంధించి నిధులు విడుదల చేయాలని మోదీని కోరిన జగన్

09/06/2019,8:30PM
Picture

తిరమలలో ప్రధాని మోదీ, ఏపీ సీఎం జగన్ మోదీ

ప్రత్యేక హోదా ఇవ్వాలని మరోసారి మోదీని కోరిన జగన్

09/06/2019,8:27PM
Picture

ప్రధాని తిరుమల పర్యటన

శ్రీవారి దర్శనం పూర్తి చేసుకుని పద్మావతి అతిధి గృహానికి చేరుకున్న ప్రధాని మోడీ..

09/06/2019,8:11PM
Picture

శ్రీవారి సేవలో ప్రధాని

మోదీకి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసిన ఆలయ ఈఓ, జేఈఓ

09/06/2019,8:01PM
Picture

తిరుమల శ్రీవారి సేవలో మోదీ

రంగనాయకుల మండపంలో మోదీకి వేదపండితుల ఆశీర్వచనాలు

09/06/2019,7:59PM
Picture

ప్రధాని తిరుమల పర్యటన

శ్రీవారిని దర్శించుకున్న మోదీ. ఆయనతో పాటు శ్రీవారి దర్శించుకున్న ఏపీ సీఎం జగన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

09/06/2019,7:51PM
Picture

తిరుమల స్వామివారి సన్నిధిలో ప్రధాని

సంప్రాదాయ వస్త్రాలతో గుడిలోకి ప్రవేశించిన మోదీ, గవర్నర్ నరసింహాన్, ఏపీ సీఎం జగన్

 

Picture

తిరుమల గుడిలో ప్రధాని

09/06/2019,7:40PM
ప్రధాని మోదీకి స్వాగతం పలికిన అర్చకులు, పండితులు, టీటీడీ ఉన్నతాధికారులు. ధ్వజస్తంభానికి నమస్కరించిన ప్రధాని

09/06/2019,7:43PM
Picture

తిరుమల చేరుకున్న ప్రధాని మోదీ

మహాద్వారం గుండా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించిన మోదీ

09/06/2019,7:38PM
Picture

తిరుమలలో ప్రధాని పర్యటన

09/06/2019,6:21PM
Picture

తిరుమలలో ప్రధాని పర్యటన

ప్రధానితో పాటు శ్రీవారిని దర్శించుకోనున్న గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం జగన్, కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి

09/06/2019,6:19PM
Picture

తిరుమలలో ప్రధాని పర్యటన

సభ ముగించిన అనంతరం శ్రీవారిని దర్శించుకోడానికి బయలుదేరిన ప్రధాని మోదీ

09/06/2019,6:18PM
Picture

తిరుమలలో ప్రధాని స్పీచ్

ఓట్లు వేసినా, వేయకపోయినా ప్రజలకు సేవ చేయడమే తమ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తిరుపతిలో బీజేపీ నిర్వహించిన ప్రజాధన్యవాద సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. రెండోసారి ప్రధాని అయ్యాక తిరుమల శ్రీవారి దర్శనానికి రావడం ఆనందంగా ఉందన్నారు. ‘మా వరకు ఎన్నికల అధ్యాయం ముగిసిపోయింది. 130 కోట్ల మందికి సేవ చేసే అధ్యాయం ప్రారంభమైంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగన్ రెడ్డికి శుభాకాంక్షలు. జగన్ కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని భావిస్తున్నా. ఏపీ అభివృద్ధికి, ప్రజలకు పూర్తి సహకారం అందిస్తానని భరోసా ఇస్తున్నా.’ అని ప్రధాని మోదీ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నో అంశాల్లో ముందుంటుందని ప్రధాని మోదీ చెప్పారు. వ్యవసాయం నుంచి విజ్ఞానం వరకు, ఇన్నొవేషన్ నుంచి స్టార్టప్స్ వరకు ఏపీ.. కొత్త మార్గంలో పయనిస్తుందని మోదీ అన్నారు. ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందితేనే నవభారతం నిర్మాణం అవుతుందని ప్రధాని మోదీ అన్నారు.

09/06/2019,6:13PM
Picture

తిరుమలలో ప్రధాని స్పీచ్

ఎన్నికల ఫలితాల షాక్ నుంచి కొంతమంది నేతలు తేరుకోలేదు

09/06/2019,6:15PM
Picture

తిరుమలలో ప్రధాని స్పీచ్

జగన్ నాయకత్వంలో ఏపీలో బలమైన ప్రభుత్వం ఏర్పడింది

09/06/2019,6:08PM
Picture

తిరుమలలో ప్రధాని స్పీచ్

ఏపీ కొత్త సీఎంకు జగన్ రెడ్డికి అభినందనలు..ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుంది

09/06/2019,6:01PM
Picture

తిరుమలలో ప్రధాని స్పీచ్

మున్సిపల్ ఎన్నికల్లో గెలవలేని స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చాం

09/06/2019,5:58PM
Picture

తిరుమలలో ప్రధాని స్పీచ్

ప్రజల మనసులు గెలుచుకునేందుకు 365 రోజులు ప్రభుత్వం పనిచేస్తుంది

09/06/2019,5:58PM
Picture

తిరుమలలో ప్రధాని స్పీచ్

ఎన్నికలకు, రాజకీయాలకు మాత్రమే బీజేపీ పరిమితం కాదు

09/06/2019,5:57PM
Picture

తిరుమలలో ప్రధాని స్పీచ్

భవిష్యత్‌లో ఏపీ, తమిళనాడులో అధికారంలోకి వస్తాం

09/06/2019,5:56PM
Picture

తిరుమలలో ప్రధాని స్పీచ్

కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత స్వామివారి దర్శనానికి వచ్చా..130 కోట్ల మంది ఆశలు నెరవేరాలని స్వామివారిని ప్రార్థించా

09/06/2019,5:53PM
Picture

తిరుమలలో ప్రధాని స్పీచ్

రెండోసారి అధికారం అందించినందుకు ప్రజలందరకూ ధన్యవాదాలు

09/06/2019,5:52PM
Picture

తిరుమల ప్రధాని స్పీచ్

శ్రీలంకలో కార్యక్రమాల వల్ల ఆలస్యమైనందుకు క్షమాపనలు తెలిపిన ప్రధాని

09/06/2019,5:50PM
Picture

ప్రధాని మోదీ తిరుమల పర్యటన

తెలుగులో స్వీచ్ ప్రారంభించిన ప్రధాని మోదీ

09/06/2019,5:47PM
Picture

ప్రధాని మోదీ తిరుమల పర్యటన

భారత్ మాతాకి జై అంటూ స్పీచ్ ఫ్రారంభించిన ప్రధాని మోదీ..తిరుపతి వెంకన్న స్మరించిన మోదీ

09/06/2019,5:45PM
Picture

ప్రధాని మోదీ తిరుమల పర్యటన

సభావేదిక వద్ద బీజేపీ నేతలు, కార్యకర్తలు ప్రధానికి ఘనస్వాగతం పలికారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పుష్పగుచ్చం అందించి, కిరీటాన్ని బహుకరించారు.

09/06/2019,5:43PM
Picture

ప్రధాని మోదీ తిరుమల పర్యటన

సభావేదికకు చేరుకున్న ప్రధాని

09/06/2019,5:37PM
Picture

ప్రధానికి ఘనస్వాగతం

రేణుగుంటలో మోదీకి ఘనస్వాగతం పలికిన గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం జగన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

09/06/2019,5:28PM
Picture

ప్రధాని మోదీ తిరుమల పర్యటన

మట్టిపనులతో టీడీపీ పనులు రాష్ట్రాన్ని దోచుకున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. ప్రాజెక్టుల్లో ఆ పార్టీ నేతలు భారీ అక్రమాలకు పాల్పడ్డారని, టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ ఆప్కో బట్టల కొనుగోళ్లలో వందల కోట్లు దండుకున్నారని విమర్శించారు. ఆదివారం తిరుపతిలో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో జరిగిన ప్రజా ధన్యవాద సభలో ఏపీలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పోలవరం, హంద్రీనీవా వంటి సాగునీటి ప్రాజెక్టులు చేపడితే చంద్రబాదు రాజధాని పేరుతో కాలక్షేపం చేశారని దుయ్యబట్టారు.

09/06/2019,5:00PM
Picture

మోదీకి ఘనస్వాగతం?

రేణిగుంట విమానాశ్రయంలో ప్రధానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వాగతం పలుకనున్నారు. అనంతరం అక్కడి కార్బన్‌ ఉత్పత్తి కేంద్రం ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. సభ అనంతరం ఆయన తిరుమలకు చేరుకుంటారు. సాయంత్రం 6. 15 గంటల నుంచి రాత్రి 7.15 గంటల వరకు ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు. రాత్రి 8. 15 గంటలకు ప్రధాని మోదీ తిరిగి ఢిల్లీకి వెళతారు.

09/06/2019,4:57PM
Picture

ప్రధాని మోదీ తిరుమల పర్యటన

ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాక సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొద్దిసేపటిక్రితమే రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. ఇక, కొలంబో నుంచి తిరుమలకు బయలుదేరిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరికాసేపట్లో ఇక్కడికి రానున్నారు.

09/06/2019,4:54PM
Picture

ప్రధాని మోదీ తిరుమల పర్యటన

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి ఉజ్వల భవిష్యత్‌ ఉందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీ ఏపీ ప్రజల ఆదరణ కోల్పోయిందని, సమస్యలపై పోరాటం చేస్తూ బీజేపీ ప్రజల మన్ననలు పొందేలా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఆదివారం తిరుపతిలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే ప్రజా ధన్యవాద సభలో కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ ఏపీలో బీజేపీ బలపడుతుందని చెప్పారు. ఎన్టీఆర్‌ ఆశయాలకు చంద్రబాబు తూట్లు పొడిచారని ఆయన ఆరోపించారు. ఎన్టీఆర్‌ సిద్ధాంతాలను రాహుల్‌ కాళ్లదగ్గర పెట్టిన చంద్రబాబును ఏపీ ప్రజలు క్షమించరని అన్నారు.

09/06/2019,4:52PM
Picture

ప్రధాని మోదీ తిరుమల పర్యటన

ప్రధాని నరేంద్రమోదీ రాక నేపథ్యంలో తిరుపతిలో బీజేపీ చేపట్టిన ‘ప్రజా ధన్యవాద సభ’ ప్రారంభమైంది. ఈ సభలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

09/06/2019,4:46PM
Picture

ప్రధాని మోదీ తిరుమల పర్యటన

శ్రీలంక పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ తిరిగి భారత్‌కు పయనమయ్యారు. ప్రధానిగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన అనంతరం చేసిన తొలి విదేశీ పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్నట్లు ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

09/06/2019,4:50PM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *