చైనాకు ప్రధాని మోదీ సీరియస్ వార్నింగ్

సైనికుల త్యాగాలను వృధా కానివ్వబోమంటూ ప్రధాని మోదీ అన్నారు. 15 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. చైనా సరిహద్దు హింసపై ప్రధాని మాట్లాడారు. మన హక్కులు కాపాడుకునే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. సమయం వచ్చినప్పుడు మన సత్తా, శక్తి సామర్థ్యాలు చాటి చెప్పుతామని స్పష్టం చేశారు. మనమేంటో చాటి చెప్పే విషయంలో మనల్ని ఎవరూ అడ్డుకోలేరని గుర్తు చేశారు. మనం శాంతిని కోరుకుంటున్నామని…. కానీ ఎవరైనా రెచ్చగొడితే సహించేది […]

చైనాకు ప్రధాని మోదీ సీరియస్ వార్నింగ్
Follow us

|

Updated on: Jun 17, 2020 | 4:46 PM

సైనికుల త్యాగాలను వృధా కానివ్వబోమంటూ ప్రధాని మోదీ అన్నారు. 15 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. చైనా సరిహద్దు హింసపై ప్రధాని మాట్లాడారు. మన హక్కులు కాపాడుకునే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. సమయం వచ్చినప్పుడు మన సత్తా, శక్తి సామర్థ్యాలు చాటి చెప్పుతామని స్పష్టం చేశారు. మనమేంటో చాటి చెప్పే విషయంలో మనల్ని ఎవరూ అడ్డుకోలేరని గుర్తు చేశారు. మనం శాంతిని కోరుకుంటున్నామని…. కానీ ఎవరైనా రెచ్చగొడితే సహించేది లేదని పరోక్షోంగా చైనా, పాకిస్తాన్ దేశాలను హెచ్చరించారు. రెచ్చగొట్టేవారికి ధీటైన సమాధానం తర్వలోనే చెబుతామన్నారు. వారికి బుద్ధి చెప్పే సత్తా మనకుందని అన్నారు. ముఖ్యమంత్రులందరినీ 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా సమావేశ ప్రారంభంలో ప్రధాని మోదీ కోరారు.