దేశవ్యాప్తంగా ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ.. వరుస ట్వీట్లు..

Sankranti Wishes From Modi: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు...

  • Ravi Kiran
  • Publish Date - 11:57 am, Thu, 14 January 21
దేశవ్యాప్తంగా ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ.. వరుస ట్వీట్లు..

Sankranti Wishes From Modi: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు ఈ పెద్ద పండుగను వీనులవిందుగా జరుపుకుంటారు. ఈ మేరకు మోదీ వివిధ ప్రాంతాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ వరుస ట్వీట్లు చేశారు.

”భారతదేశంలోని అనేక ప్రాంతాలకు చెందిన ప్రజలు మకర సంక్రాంతిని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పర్వదినం భారతదేశ వైవిధ్యాన్ని, మన సంప్రదాయాల చైతన్యాన్ని గుర్తుకు తెస్తుంది. ఈ పండుగ ప్రకృతి ప్రాముఖ్యతను కూడా ప్రోత్సహిస్తుంది” అని పేర్కొంటూ మోదీ ట్వీట్ చేశారు.