ముగిసిన ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన.. కరోనా టీకా పరీక్షల పురోగతిపై భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు

| Edited By: Team Veegam

Updated on: Nov 28, 2020 | 3:45 PM

మూడో దశ క్లనికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. మోదీ ఆ సంస్థలో కరోనా టీకా అభివృద్ధి, ఉత్పత్తిని పరిశీలించి పురోగతి పనులను సమీక్షిస్తారు. భారత్ బయోటెక్ యాజమాన్యం, శాస్త్రవేత్తలతో...

ముగిసిన ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన.. కరోనా టీకా పరీక్షల పురోగతిపై భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు

ప్రధాని మోదీ వ్యాక్సిన్‌ టూర్‌ కొనసాగుతోంది. ఉదయం అహ్మదాబాద్‌లోని మోదీ జైడస్‌ క్యాడిలా బయోటెక్‌ పార్క్‌ను సందర్శించారు. ఈ సంస్థ అభివృద్ధి చేసిన జైకోవ్‌-డి టీకా ప్రయోగాలను గురించి శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. పీపీఈ కిట్‌ ధరించి వ్యాక్సిన్‌ ప్రయోశాలను పరిశీలించారు. అహ్మదాబాద్‌ నుంచి నేరుగా ప్రధాని హైదరాబాద్‌లోని హకీంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రధాని… రోడ్డు మార్గం ద్వారా జీనోమ్‌వ్యాలీలోని భారత్‌ బయోటెక్‌ కంపెనీకి వెళ్లారు. అనంతరం అక్కడ కోవాగ్జిన్‌ ప్రయోగాలను పరిశీలించారు.. వ్యాక్సిన్‌ మూడోదశ ప్రయోగాలపై భారత్‌ బయోటెక్‌ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడుతున్నారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 28 Nov 2020 03:31 PM (IST)

    పూణె వెళ్లేందుకు టేకాఫ్ అయిన మోదీ ఫ్లైట్..

    ఇవాళ (శనివారం) మధ్యాహ్నం12 గంటల 55 నిమిషాలకు హైదరాబాద్ లోని హకీంపేట చేరుకున్నారు మోదీ. దాదాపు రెండున్నర గంటలపాటు కొనసాగిన ప్రధాని పర్యటన అంతా ప్రొటోకాల్ ప్రాకారం సాగింది. ప్రధానికి వీడ్కోలు పలికేందుకు తెలంగాణ నుంచి తెలంగాణ చీఫ్ సెక్రటరీ, డీజీపీ సహా ఐదుగురుకి మాత్రమే అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. వీరంతా ప్రధానికి సెండాఫ్ ఇవ్వగా మోదీ ఫ్లైట్ టేకాఫ్ అయింది. హైదరాబాద్ పర్యటన ముగిసిన నేపథ్యంలో ప్రధాని పూణె చేరుకుని అక్కడి  సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను సందర్శిస్తారు.

  • 28 Nov 2020 03:18 PM (IST)

    ముగిసిన భారత ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన

    ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటన ముగిసింది. ఒక రోజు పర్యటనలో భాగంగా మోదీ హైదరాబాద్‌లో పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. చివరిగా భారత్ బయోటెక్ సందర్శించిన మోదీ, అక్కడి శాస్త్రవేత్తలతో దాదాపు 40 నిమిషాలపాటు సమావేశం నిర్వహించారు. కరోనా టీకా కోవాగ్జిన్ వ్యాక్సిన్ పురోగతిపై శాస్త్రవేత్తలతో మోదీ చర్చించారు. టీకా ప్రయోగశాలను సందర్శించారు. పూర్తి స్వదేశీ వ్యాక్సిన్ అభివృద్ధి పర్చడంలో ఇప్పటివరకు పరీక్షల్లో పురోగతి సాధించినందుకు మోదీ శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు చెప్పారు.   అనంతరం బయటకు వచ్చిన మోదీ అందరికీ అభివాదం చేస్తూ పూణె కు పయనమయ్యేందుకు కాన్వాయ్ లో హకీంపేటకు బయలుదేరారు. భారత్ బయోటెక్ నుంచి  20 నిమిషాల్లో మోదీ హకీంపేట చేరుకున్నారు.

  • 28 Nov 2020 02:31 PM (IST)

    మరికాసేపట్లో హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. పర్యటనలో కరోనా టీకా అభివృద్ధిపై సమీక్ష

    అహ్మదాబాద్ టు హైదరాబాద్...

    భారత్​ బయోటెక్​కు.. ఈ మధ్యాహ్నం హైదరాబాద్​లోని హకీంపేట వైమానికి స్థావరానికి ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. అక్కడి నుంచి నగర శివార్లలోని జినోమ్ వ్యాలీలో గల భారత్​ బయోటెక్ సంస్థకు వెళ్తారు. ఈ సంస్థ 'కొవాగ్జిన్' పేరుతో టీకాను అభివృద్ధి చేస్తోంది.

  • 28 Nov 2020 02:30 PM (IST)

    హకీంపేటకు చేరుకున్న ప్రదాని మోదీ.. నేరుగా జినోమ్‌వ్యాలీకి..

    హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ

    అహ్మదాబాద్​లో జైడస్​ బయోటెక్ సందర్శన అనంతరం హైదరబాద్​కు బయలుదేరిన ప్రధాని మోదీ ...హకీంపేటకు చేరుకున్నారు.హకీంపేట నుంచి రోడ్డు మార్గం ద్వారా జినోమ్‌వ్యాలీకి వెళ్లనున్నారు ప్రధాని.

  • 28 Nov 2020 02:16 PM (IST)

    ముందంజలో భారత్‌ బయోటెక్‌.. కోవాగ్జిన్‌ ప్రస్తుతం మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్

    కోవిడ్‌ టీకా ప్రయోగాలు చేస్తున్న భారత్‌ బయోటెక్

    హైదరాబాద్‌ బేస్డ్‌ ఫార్మా కంపెనీ భారత్‌ బయోటెక్‌ కూడా వ్యాక్సిన్‌ ప్రయోగాల్లో ముందంజలో ఉంది. కోవాగ్జిన్‌ ప్రస్తుతం మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తోంది. దేశంలోనే అత్యధిక మందిపై మొదటిసారిగా కోవిడ్‌ టీకా ప్రయోగాలు చేస్తున్న కంపెనీ భారత్‌ బయోటెక్‌.

  • 28 Nov 2020 02:11 PM (IST)

    శాస్త్రవేత్తలతో ప్రధాని సమీక్ష... కొవాగ్జిన్‌ పురోగతిపై ఆరా..శాస్త్రవేత్తలను అభినందించిన మోదీ

    ప్రయోగాల్లో మెరుగైన ఫలితాలు

    రెండు దశల్లో జరిగిన ప్రయోగాల్లో మెరుగైన ఫలితాలు సాధించడంపై శాస్త్రవేత్తలను మోదీ అభినందించారు. ప్రస్తుతం మూడోదశలో ప్రయోగాలు ఎలా సాగుతున్నాయి ? ఎప్పటిలోగా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశముంది ? అనే విషయాలను శాస్త్రవేత్తలను ప్రధాని అడిగి తెలుసుకున్నారు.

  • 28 Nov 2020 01:55 PM (IST)

    హైదరాబాద్‌కు ప్రధాని మోదీ ... రోడ్డు మార్గంలో భారత్‌ బయోటెక్‌కు.. కోవాగ్జిన్ ప్రొగ్రెస్‌పై రివ్యూ

    భారత్ బయోటెక్‌లో కొనసాగుతున్న మోదీ విజిట్

    భారత్ బయోటెక్‌లో శాస్త్రవేత్తలతో ప్రధాని మోదీ చర్చలు జరిపారు. కోవాగ్జిన్ ప్రయోగాల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రయోగంలో జరుగుతున్న పురోగతిని ప్రధాని మోదీకి శాస్త్రవేత్తలు వివరించారు. ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ లో కోవాగ్జిన్ ఉందని తెలిపారు.

  • 28 Nov 2020 01:45 PM (IST)

    భారత్ బయోటెక్‌కు ప్రధాని మోదీ.. శాస్త్రవేత్తలతో సమీక్ష.. టీకా అభివృద్ధిపై ఆరా..

    కొవాగ్జిన్‌ పురోగతిపై శాస్త్రవేత్తలతో ప్రధాని సమీక్ష

    హకీంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి మోదీ రోడ్డు మార్గం ద్వారా జీనోమ్‌వ్యాలీలోని భారత్‌ బయోటెక్‌ కంపెనీకి చేరుకున్నారు. అక్కడ కోవాగ్జిన్‌ ప్రయోగాలను పరిశీలిస్తున్నారు. అనంతరం భారత్‌ బయోటెక్‌ సంస్థ ప్రతినిధులతో మాట్లాడనున్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌ నుంచి నేరుగా పుణెకు చేరుకుంటారు. అక్కడ సిరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో వ్యాక్సిన్‌ ప్రయోగాలను పరిశీలిస్తారు.

  • 28 Nov 2020 01:29 PM (IST)

    హకీంపేట ఎయిర్‌బేస్‌కు చేరుకున్న ప్రధాని మోదీ..స్వాగతం పలికిన సీఎస్‌, డీజీపీ,

    ప్రధాని మోదీకి స్వాగతం పలికిన అధికారులు

    ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితమే హకీంపేట ఎయిర్‌బేస్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మోదీకి సీఎస్‌, డీజీపీ, సైబరాబాద్‌ సీపీ, కలెక్టర్‌ స్వాగతం పలికారు. మరికాసేపట్లో జినోమ్‌ వ్యాలీలోని భారత్‌ బయోటెక్‌ సందర్శనకు ప్రధాని బయలుదేరి వెళ్లనున్నారు.  హకీంపేట నుంచి రోడ్డు మార్గంలో జినోమ్‌ వ్యాలీకి  వెళ్లనున్నారు. కొవాగ్జిన్‌ పురోగతిపై శాస్త్రవేత్తలతో ప్రధాని చర్చించనున్నారు.  'కొవాగ్జిన్‌' మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉన్న విషయం తెలిసిందే. మధ్యాహ్నం 2:15 గంటలకు బయోటెక్‌ నుంచి హకీంపేటకు ప్రధాని మోదీ తిరుగు పయనంకానున్నారు.

  • 28 Nov 2020 01:19 PM (IST)

    ప్రధాని మోదీకి అధికారుల స్వాగతం.. హకీంపేట్ నుంచి నేరుగా భారత్ బయోటెక్‌ చేరుకున్నారు

    హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్‌

    ప్రధాని మోదీ మధ్యాహ్నం 1.25 గం.కు భారత్ బయోటెక్‌కు చేరుకోనున్నారు. అక్కడే 2.10 గంటల వరకు భారత్ బయోటెక్ సందర్శిస్తారు. అనంతరం శాస్త్రవేత్తలతో మాట్లాడి.. కొవాగ్జిన్ పురోగతిని తెలుసుకోంటారు.

    మ.2.15 గం.కు భారత్ బయోటెక్ నుంచి హకీంపేటకు తిరుగు పయనం అవుతారు. మధ్యాహ్నం 2.40 గం.కు హకీంపేట విమానాశ్రయం చేరుకోని..మధ్యాహ్నం 3.50 గం.కు హకీంపేట నుంచి పుణె బయలుదేరుతారు.

  • 28 Nov 2020 01:05 PM (IST)

    హకీంపేటకు చేరుకున్న ప్రదాని మోదీ.. నేరుగా జినోమ్‌వ్యాలీకి..

    హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ

    అహ్మదాబాద్​లో జైడస్​ బయోటెక్ సందర్శన అనంతరం హైదరబాద్​కు బయలుదేరిన ప్రధాని మోదీ ...హకీంపేటకు చేరుకున్నారు.హకీంపేట నుంచి రోడ్డు మార్గం ద్వారా జినోమ్‌వ్యాలీకి వెళ్లనున్నారు ప్రధాని.

Published On - Nov 28,2020 3:31 PM

Follow us
పడి లేచిన కెరటానికి టీ20 ప్రపంచకప్‌లో బెర్త్ కన్ఫామా..
పడి లేచిన కెరటానికి టీ20 ప్రపంచకప్‌లో బెర్త్ కన్ఫామా..
నామినేషన్ వేళ అభ్యర్థుల మార్పు.? చివరి నిమిషంలో ఈ నిర్ణయం దేనికి
నామినేషన్ వేళ అభ్యర్థుల మార్పు.? చివరి నిమిషంలో ఈ నిర్ణయం దేనికి
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రోజంతా ల్యాప్‌టాప్‌ ముందే కూర్చుంటున్నారా..?మీ ఆయుష్షు తగ్గినట్టే
రోజంతా ల్యాప్‌టాప్‌ ముందే కూర్చుంటున్నారా..?మీ ఆయుష్షు తగ్గినట్టే
మాధవీ లత వర్సెస్ అసదుద్దీన్.. హైదరాబాద్‎లో హోరెత్తుతున్న ప్రచారం
మాధవీ లత వర్సెస్ అసదుద్దీన్.. హైదరాబాద్‎లో హోరెత్తుతున్న ప్రచారం
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!
ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..
వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..
LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..
LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..
లోక్ సభ ఎన్నికలకు ప్రారంభమైన పోలింగ్.. ఓటు వేసిన ప్రముఖులు..
లోక్ సభ ఎన్నికలకు ప్రారంభమైన పోలింగ్.. ఓటు వేసిన ప్రముఖులు..
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా