ప్రతిష్టాత్మాక “గంగా సమ్మేళన్‌’లో ప్రధాని మోదీ

ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌లో నిర్వహించనున్న గంగా సమ్మేళన్‌లో ప్రధాని మోదీ పాల్గొన్ని ప్రసంగించనున్నారు. గంగా సమ్మేళన్‌ జరిగే తేదీని ఇప్పటి వరకూ ఖరారు చేయకపోయినప్పటికీ, దీనికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి.  ఉత్తరాఖండ్‌లోని గోముఖ్‌ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని గంగాసాగర్‌ వరకూ గంగానది ప్రక్షాళన చేయడం లక్ష్యంగా గంగా సమ్మేళన్‌ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఐఐటీ – కాన్పూర్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే కాన్పూర్‌ జిల్లా మెజిస్టేట్‌ విజయ్‌ విశ్వాస్‌ పంత్‌ ఐఐటీని […]

ప్రతిష్టాత్మాక గంగా సమ్మేళన్‌'లో ప్రధాని మోదీ
Follow us

|

Updated on: Aug 16, 2019 | 3:40 PM

ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌లో నిర్వహించనున్న గంగా సమ్మేళన్‌లో ప్రధాని మోదీ పాల్గొన్ని ప్రసంగించనున్నారు. గంగా సమ్మేళన్‌ జరిగే తేదీని ఇప్పటి వరకూ ఖరారు చేయకపోయినప్పటికీ, దీనికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి.  ఉత్తరాఖండ్‌లోని గోముఖ్‌ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని గంగాసాగర్‌ వరకూ గంగానది ప్రక్షాళన చేయడం లక్ష్యంగా గంగా సమ్మేళన్‌ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఐఐటీ – కాన్పూర్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే కాన్పూర్‌ జిల్లా మెజిస్టేట్‌ విజయ్‌ విశ్వాస్‌ పంత్‌ ఐఐటీని సందర్శించి ప్రధాని పర్యటనకు సంబంధించి అక్కడ అధికారులతో చర్చించారు. కాగా గంగానది ప్రవహించే ఉత్తరాఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, బీహార్‌, పశ్చిబెంగాల్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. “నమామి గంగా’ పేరుతో గంగానది ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది బీజేపీ ప్రభుత్వం. ఆ మేరకు త్వరలో కార్యక్రమం ప్రారంభంకానుంది.