Breaking News
  • హైదరాబాద్‌: గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ దాష్టీకం. విద్యార్థిని నేలకేసి కొట్టిన ప్రిన్సిపాల్‌ సుబ్రహ్మణ్యం. ప్రిన్సిపాల్‌ను నిలదీసిన విద్యార్థి తల్లిదండ్రులు. మీకు దిక్కున్న చోట చెప్పుకోండని దురుసుప్రవర్తన. ప్రిన్సిపాల్‌ సుబ్రహ్మణం కులంపేరుతో దూషిస్తూ.. చితకబాదుతున్నాడని కన్నీళ్లు పెట్టుకున్న విద్యార్థులు.
  • ఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్జీటీలో విచారణ. విచారణకు హాజరుకాని తెలంగాణ పీసీబీ అధికారులు . తదుపరి విచారణ ఫిబ్రవరి 10కి వాయిదా . పర్యావరణ అనుమతుల విషయంలో పీసీబీ అధికారులు.. నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న పిటిషనర్‌ హయాతుద్దీన్‌.
  • ఢిల్లీ: 2020-21 వార్షిక బడ్జెట్‌ ప్రతుల ముద్రణ ప్రారంభం. ఆర్థికశాఖ కార్యాలయం నార్త్‌బ్లాక్‌లో హల్వా వేడుక. బడ్జెట్‌ ప్రతుల ముద్రణ సందర్భంగా హల్వా వేడుక ఆనవాయితీ. హాజరైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. సహాయమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, ఆర్థికశాఖ కార్యదర్శులు.
  • ప.గో: ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని బీజేపీ నినాదం-మాణిక్యాలరావు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల గురించి టీడీపీ మాట్లాడుతోంది. ఐదు కోట్ల ఆంధ్రుల తరపున బీజేపీ-జనసేన పోరాడుతుంది. రాష్ట్రంలో జగన్ పాలన తుగ్లక్ పాలనను గుర్తుచేస్తోంది-మాణిక్యాలరావు.
  • సిద్దిపేట: గజ్వేల్‌లో మంత్రి హరీష్‌రావు ఎన్నికల ప్రచారం. ఈ ఎన్నికల్లో ఉత్తమ్‌ మాటలన్నీ ఉత్తర ప్రగల్బాలే అని తేలిపోనుంది. 2 వేల వార్డులు గెలుస్తామంటున్న బీజేపీకి.. గజ్వేల్‌లోని 20 వార్డుల్లో ఏ ఒక్క వార్డు గెలవలేరు-హరీష్‌రావు. 20 వార్డులను గెలిపించుకుంటే మరింత అభివృద్ధి-హరీష్‌రావు.

మోదీ కొత్త కేబినెట్‌లో వీరికే చోటు..?

PM Modi's New Cabinet, మోదీ కొత్త కేబినెట్‌లో వీరికే చోటు..?

సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి కేంద్రంలో అధికారాన్ని అధిరోహించేందుకు బీజేపీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి కొత్త మంత్రివర్గం ఏర్పాటుపై పడింది. ఈసారి మోదీ మంత్రివర్గంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షాతో పలు కొత్త ముఖాలు కనబడే అవకాశం ఉందని తెలుస్తోంది. అమిత్‌ షాను మంత్రివర్గంలోకి తీసుకునే క్రమంలో ఆయనకు హోం, ఆర్థిక, విదేశీ వ్యవహారాలు, రక్షణ.. ఈ నాలుగింటిలో ఏదో ఒక శాఖ అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మరోవైపు బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వెస్ట్ బెంగాల్ నుంచి గెలిచిన వారికి కూడా మంత్రివర్గంలో కీలక శాఖలు అప్పగిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకప్పుడు వెస్ట్ బెంగాల్‌లో రెండు సీట్లకే పరిమితమైన బీజేపీ ఈసారి ఎన్నికల్లో 18 సీట్లు గెలుచుకుంది. అంతేకాదు ఎన్నికల ప్రచార సమయంలో పలు అల్లర్లు కూడా చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

అటు ఆర్ధిక శాఖ పదవికి ఈసారి అరుణ్ జైట్లీ, పీయూష్ గోయల్ మధ్య గట్టి పోటీ నెలకొంది. గతంలో అరుణ్ జైట్లీ ఆరోగ్యం బాగోలేనప్పుడు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అందుకే ఈసారి జైట్లీ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ఆయనకు ఏ శాఖ అప్పగించాలి అనేదాన్ని నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నారట పార్టీ పెద్దలు.

కాగా నిర్మలా సీతారామన్, అమేథి నుంచి రాహుల్ గాంధీపై గెలిచిన స్మృతి ఇరానీ, రాజ్ నాధ్ సింగ్, రవిశంకర్ ప్రసాద్, నరేంద్ర సింగ్ తోమర్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, ప్రకాష్ జవదేకర్‌లకు ఖచ్చితంగా కొత్త కేబినెట్‌లో చోటు దక్కే అవకాశాలున్నాయని ప్రచారం సాగుతోంది.