కలిసి పని చేద్దామని మోదీ అన్నారు.. కుదరదన్నాను

ప్రధాని మోదీ తనను ఓ కోరిక కోరారని, కానీ తాను ఒప్పుకోలేదని అన్నారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ . ‘ మనం (ఎన్సీపీ, బీజేపీ) కలిసి పని చేద్దాం.. అని మోదీ నన్ను కోరారు.. అయితే ఆ ఆఫర్ ని నేను తిరస్కరించాను ‘ అని ఆయన చెప్పారు. మనం ఇద్దరం కలిసి పని చేయడమన్నది సాధ్యం కాదని ఆయనకు చెప్పానన్నారు. మన వ్యక్తిగత సంబంధాలు చాలా బాగున్నాయని, అవి మాత్రం అలాగే కొనసాగుతాయని.. కానీ […]

కలిసి పని చేద్దామని మోదీ అన్నారు.. కుదరదన్నాను
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Dec 03, 2019 | 12:00 PM

ప్రధాని మోదీ తనను ఓ కోరిక కోరారని, కానీ తాను ఒప్పుకోలేదని అన్నారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ . ‘ మనం (ఎన్సీపీ, బీజేపీ) కలిసి పని చేద్దాం.. అని మోదీ నన్ను కోరారు.. అయితే ఆ ఆఫర్ ని నేను తిరస్కరించాను ‘ అని ఆయన చెప్పారు. మనం ఇద్దరం కలిసి పని చేయడమన్నది సాధ్యం కాదని ఆయనకు చెప్పానన్నారు. మన వ్యక్తిగత సంబంధాలు చాలా బాగున్నాయని, అవి మాత్రం అలాగే కొనసాగుతాయని.. కానీ ఇలా చేతులు కలిపి పని చేయడం మాత్రం అసాధ్యమని స్పష్టం చేశాను అన్నారాయన.. తనను భారత రాష్ట్రపతి చేయడానికి మోదీ సుముఖత వ్యక్తం చేశారని, ఆ ఆఫర్ ఇచ్చ్చారని వఛ్చిన వార్తలను శరద్ పవార్ తోసిపుచ్చారు. అయితే ఆయన (మోదీ) కేబినెట్లో తన కూతురు సుప్రియసూలేని మంత్రిని చేస్తానన్న ఆఫర్ మాత్రం ఆయన నుంచి రాలేదని పవార్ వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పవార్.. తనను మోదీ ఆ మధ్య ప్రశంసలతో ముంచెత్తారని చెప్పుకున్నారు. రాజ్యసభ 250 వ సెషన్ సందర్భంగా నేను మాట్లాడినప్పుడు ఆయన నన్ను పొగడ్తలతో ముంచెత్తారు.. పార్లమెంటరీ సంప్రదాయాలకు ఎలా కట్టుబడి ఉండాలో ఎన్సీపీ నుంచి బీజేపీ సహా కొన్ని పార్టీలు నేర్చుకోవాలని నేను నాడు సలహా ఇఛ్చాను అని పవార్ పేర్కొన్నారు.

నవంబరు 28 న మహారాష్ట్ర సీఎంగా శివసేన అధినేత ఉధ్ధవ్ థాక్రే ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో తన ‘ దగ్గరి బంధువు ‘ అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయకపోవడానికి ముఖ్య కారణం ఉందన్నారు. నాడు బీజేపీ నేత తాత్కాలిక ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కు అజిత్ హఠాత్తుగా మద్దతు నిస్తున్న విషయం గురించి తెలియగానే నేను వెంటనే ఉధ్ధవ్ థాక్రేకు ఫోన్ చేశాను. అయితే అలా (అజిత్‌కి మద్దతు) జరగడం సరికాదని చెప్పాను .. అజిత్ తీరు (తిరుగుబాటు) ను అణచివేస్తానన్న నమ్మకాన్ని ఉధ్ధవ్ కు కలిగించాను అని పవార్ పేర్కొన్నారు.