కరోనాపై ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్…నివారణే లక్ష్యం

అటు-నిజాముద్దీన్ మత కార్యక్రమాల్లో పాల్గొన్న వారి ఆచూకీ కోసం అన్ని రాష్ట్రాలూ ప్రయత్నాలు మొదలు పెట్టాయి. వీరిలో కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నవారి కారణంగా దేశ వ్యాప్తంగా దాదాపు 400 కేసులు నమోదైనట్టు అంచనా.

కరోనాపై ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్...నివారణే లక్ష్యం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 02, 2020 | 3:46 PM

కరోనావైరస్  వ్యాప్తిపై ప్రధాని మోదీ గురువారం దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మహమ్మారి నివారణకు ఏయే రాష్ట్రాలు ఏయే చర్యలు తీసుకున్నాయో వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సంక్షోభాన్ని అందరం కలిసి కట్టుగా ఎదుర్కొందామని, పార్టీలకు, సిధ్ధాంతాలకు అతీతంగా అంతా సమైక్యంగా కృషి చేద్దామని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది. ఒక సుదీర్ఘ పోరాటానికి మీరొక పకడ్బందీ వ్యూహం రూపొందించాలని, ప్రజా ప్రయోజనాలు, వారి ఆరోగ్య భద్రతే మన ధ్యేయం కావాలని ఆయన అన్నారు. కరోనాపై మనం జరిపే సమరంలో కేంద్రం మీకు అన్నివిధాలా సహాయ పడుతుందని, అండగా ఉంటుందని మోదీ హామీ ఇచ్చారు. కాగా-ఢిల్లీలోని నిజాముద్దీన్ లోఇస్లామిక్ కార్యక్రమాలకు అనేకమంది  హాజరైన అంశం, వారిలోకొందరి ద్వారా కరోనా కేసులు పెరిగిపోవడం ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధానంగా ప్రస్తావనకు వఛ్చినట్టు సమాచారం. దేశంలోకి  ఇంతమంది విదేశీ మతబోధకుల రాక, నిజాముద్దీన్ మసీదు గేదరింగ్ అనంతరం వారు వివిధ రాష్ట్రాలకు తరలి వెళ్లిన అంశాన్ని  సైతం కొందరు సీఎం లు ప్రధాని దృష్టికి తెచ్చారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హోమ్ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అటు-నిజాముద్దీన్ మత కార్యక్రమాల్లో పాల్గొన్న వారి ఆచూకీ కోసం అన్ని రాష్ట్రాలూ ప్రయత్నాలు మొదలు పెట్టాయి. వీరిలో కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నవారి కారణంగా దేశ వ్యాప్తంగా దాదాపు 400 కేసులు నమోదైనట్టు అంచనా. తమ రాష్ట్రంలో 70 మంది విదేశీ మత బోధకులను బీహార్ ప్రభుత్వం కనుగొంది. వీరంతా రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నారు. వీరికి నిజాముద్దీన్ వ్యవహారంతో సంబంధం లేకపోయినా.. వివిధ దేశాలకు వెళ్లి వఛ్చిన ట్రావెల్ హిస్టరీ ఉన్నందున వీరు  కోవిడ్-19 రిస్క్ కేటగిరీలో ఉన్నట్టే అని అధికారులు అంటున్నారు. 1300 మంది ఫారినర్స్ తో సహా సుమారు 9 వేల మందికి తబ్లీఘీ జమాత్ ఈవెంట్ తో లింక్ ఉన్నట్టు భావిస్తున్నారు. అటు-57 మంది తబ్లీఘీ బోధకుల కోసం కూడా బీహార్ పోలీసులు గాలిస్తున్నారు. వీరిలో పలువురు విదేశియులే.

దేశంలో అనేక చోట్ల చిక్కుబడిపోయిన ప్రజలను ఈ లాక్ డౌన్ ముగిసిన అనంతరం తిరిగి వారి వారి స్వస్థలాలకు చేర్చేందుకు అనువుగా కేంద్రం, రాష్ట్రాలు ఓ ఉమ్మడి ‘నిష్క్రమణ’ వ్యూహాన్ని అనుసరించవలసిన అవసరం ఉందని మోదీ సూచించారు. లాక్ డౌన్ ముగిశాక ఇది  సాధారణ కార్యక్రమం కాదని, కొన్ని సురక్షిత చర్యలు తీసుకోవలసి ఉంటుందని ఆయన చెప్పారు.

గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.