‘కోవీషీల్డ్’ కోవిడ్ 19 వ్యాక్సీన్ పై సమీక్ష, ఈ నెల 28 న సీరం కంపెనీని విజిట్ చేయనున్న ప్రధాని మోదీ

పూణే లోని సీరం ఇన్స్ టి ట్యూట్ ఉత్పత్తి చేస్తున్న 'కోవీషీల్డ్' కోవిడ్ 19 వ్యాక్సీన్ పురోగతి, తదితర విషయాలను సమీక్షించేందుకు ప్రధాని మోదీ ఈ నెల 28 న పూణేను విజిట్ చేయనున్నారు. 

  • Umakanth Rao
  • Publish Date - 1:57 pm, Thu, 26 November 20
'కోవీషీల్డ్' కోవిడ్ 19 వ్యాక్సీన్ పై సమీక్ష, ఈ నెల 28 న సీరం కంపెనీని విజిట్ చేయనున్న ప్రధాని మోదీ

పూణే లోని సీరం ఇన్స్ టి ట్యూట్ ఉత్పత్తి చేస్తున్న ‘కోవీషీల్డ్’ కోవిడ్ 19 వ్యాక్సీన్ పురోగతి, తదితర విషయాలను సమీక్షించేందుకు ప్రధాని మోదీ ఈ నెల 28 న పూణేను విజిట్ చేయనున్నారు.  ఉత్పాదన  సహా ఇండియాలో ఈ టీకామందు పంపిణీ కోసం సీరం కంపెనీ ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనికా సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 28 న మోదీ సీరం కంపెనీని సందర్శించి, కోవిషీల్డ్  టీకామందుపై సమీక్ష నిర్వహిస్తారని పూణే డివిజినల్ కమిషనర్ సౌరవ్ రావు ధృవీకరించారు. ఇలా ఉండగా ఆస్ట్రాజెనికా ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సీన్ తీసుకున్న వలంటీర్లలో ఎవరికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని, ఎవరూ ఆసుపత్రి పాలు కాలేదని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రకటించింది. ఈ టీకామందు 90 శాతం ఎఫెక్టివ్ అని తాము భావిస్తున్నట్టు ఈ సంస్థ రీసెర్చర్లు చెప్పారు.

మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కోవిషీల్డ్ తీసుకున్న వేలాది వలంటీర్లపై నిర్వహించిన మూడో దశ ట్రయల్స్ ఫలితాలకోసం సీరం, ఆస్ట్రాజెనికా, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ఆతృతగా ఎదురుచూస్తున్నాయి.