యోగ అనేది ప్రాచీన, ఆధునిక ఆరోగ్య సాధనం

th International Yoga Day, యోగ అనేది ప్రాచీన, ఆధునిక ఆరోగ్య సాధనం" srcset="https://tv9telugu.com/wp-content/uploads/2019/06/modi-17.jpg 780w, https://tv9telugu.com/wp-content/uploads/2019/06/modi-17-300x180.jpg 300w, https://tv9telugu.com/wp-content/uploads/2019/06/modi-17-768x461.jpg 768w, https://tv9telugu.com/wp-content/uploads/2019/06/modi-17-600x360.jpg 600w" sizes="(max-width: 780px) 100vw, 780px" />

5వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో యోగాసనాలు చేస్తూ… యోగా డేను ఘనంగా జరుపుకుంటున్నారు ప్రజలు. ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలోని ప్రభాత్‌ తారా మైదానంలో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన భారీ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీనే స్వయంగా నేతృత్వం వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 40 వేల మందికి పైగా హాజరయ్యారు. అంతా కలిసి సామూహిక యోగా ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ 5వ అంతర్జాతీయ “యోగా డే”ని ఉద్దేశించి ప్రసంగించారు. యోగా దినోత్సవం జరుపుకొంటున్న ప్రతిఒక్కరికీ అభినందనలు తెలిపారు. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి అనుభూతి కలుగుజేస్తుందన్నారు. ప్రధాన మంత్రి జన్‌ ఆరోగ్య యోజన ద్వారా మెరుగైన సేవలు అందిస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు. యోగా వల్ల సామాన్యులతో పాటు అందరికీ లబ్ధిచేకూరుతుందపి… మంచి ఆరోగ్యం కూడా సమకూరుతుందన్నారు. యోగా అనేది ప్రాచీన, ఆధునిక ఆరోగ్యసాధనమని.. రోగాలు దరిచేరకుండా ఇది దోహదపడుతుందని తెలిపారు. క్రమశిక్షణ, అంకిత భావంతో యోగా పాటించాలని మోదీ పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *