రైతులకు మోదీ అమేజింగ్ ఆఫర్: నెలకు రూ.3 వేల పెన్షన్..!

PM Modi to Launch Kisan Man Dhan Yojana Scheme: Here’s All You Need to Know, రైతులకు మోదీ అమేజింగ్ ఆఫర్: నెలకు రూ.3 వేల పెన్షన్..!

ప్రధాని నరేంద్ర మోడీ.. రైతులకు మరో అమేజింగ్ ఆఫర్ తీసుకొచ్చారు. అదే.. కిసాన్ మాన్ ధన్. బుధవారమే దీన్ని జార్ఖండ్ రాజధాని రాంచీలో ప్రారంభించారు. దీని ద్వారా దాదాపు 5 కోట్ల మంది.. చిన్న, సన్నకారు రైతులకు నెలకు మూడు వేల రూపాయల చొప్పున పెన్షన్ అందనుంది. +60 ఏళ్లకు పైబడిన రైతులకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఈ స్కీమ్‌కు 40 సంవత్సరాల వయస్సు ఉన్న రైతులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

మాములు.. ప్రీమియం చెల్లించినట్టుగా.. బ్యాంకుల్లో కానీ.. సర్వీస్ సెంటర్స్ ద్వారా దీన్ని చెల్లించాల్సి ఉంటుంది. రైతులు ఎంత ప్రీమియం చెల్లిస్తారో.. దానికి సంబంధించిన డబ్బును.. 60 ఏళ్ల తరువాత వాళ్లకు.. పెన్షన్‌ రూపంలో పొందవచ్చు. వీటికి సంబంధించిన వివరాలు ప్రీమియం పత్రాల్లో ఉంటాయని చెప్పారు. ఈ స్కీంతో దాదాపు కోట్ల మంది రైతులు.. ఆసరా పొందవచ్చు. ఈస్కీంను ప్రవేశపెట్టడంతో.. రైతులు హర్షం వ్యక్తం చేస్తారు.

అయితే.. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. పీఎం-కిసాన్ స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతున్న వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. తద్వారా.. వచ్చే డబ్బులో నెల నెలా.. కొంత మొత్తం ఆటోమెటిక్‌గా కట్‌ అయి.. ప్రీమియం కిందకు వెళ్లిపోతుంది. పీఎం-కిసాన్ ఫండ్ ద్వారా ప్రీమియం చెల్లించడం ఇష్టం లేని రైతులు.. కామన్ సర్వీస్‌ సెంటర్స్ ద్వారా ప్రీమియం చెల్లించవచ్చు.

PM Modi to Launch Kisan Man Dhan Yojana Scheme: Here’s All You Need to Know, రైతులకు మోదీ అమేజింగ్ ఆఫర్: నెలకు రూ.3 వేల పెన్షన్..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *