పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగిన మోదీ

న్యూఢిల్లీ :ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఆదివారం పీఎం-కిసాన్‌ యోజన పథకాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ అక్కడనుంచి అర్ధకుంభమేళా జరుగుతున్న ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రధానికి ఘన స్వాగతం పలికారు. పవిత్ర గంగానదిలో స్నానమాచరించిన అనంతరం మోదీ సంగం ఘాట్‌ వద్ద పూజలు నిర్వహించారు. కుంభమేళా ఉత్సవాల్లో సేవలందించిన పారిశుద్ధ్య కార్మికులను కలుసుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అహోరాత్రులు పనిచేసి స్వచ్ఛత ఉట్టిపడేల సేవలందించిన పారిశుద్ధ్య కార్మికులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా కొంతమంది స్వచ్ఛ కార్మికుల పాదాలను మోదీ కడిగారు. #WATCH: Prime Minister […]

పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగిన మోదీ
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 4:54 PM

న్యూఢిల్లీ :ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఆదివారం పీఎం-కిసాన్‌ యోజన పథకాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ అక్కడనుంచి అర్ధకుంభమేళా జరుగుతున్న ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రధానికి ఘన స్వాగతం పలికారు. పవిత్ర గంగానదిలో స్నానమాచరించిన అనంతరం మోదీ సంగం ఘాట్‌ వద్ద పూజలు నిర్వహించారు. కుంభమేళా ఉత్సవాల్లో సేవలందించిన పారిశుద్ధ్య కార్మికులను కలుసుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అహోరాత్రులు పనిచేసి స్వచ్ఛత ఉట్టిపడేల సేవలందించిన పారిశుద్ధ్య కార్మికులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా కొంతమంది స్వచ్ఛ కార్మికుల పాదాలను మోదీ కడిగారు.