Breaking News
  • హైదరాబాద్‌: మంగళహాట్‌లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు. డ్రగ్స్ విక్రయిస్తున్న సూరజ్‌సింగ్‌, లలిత్‌కుమార్‌ అరెస్ట్ . నిషేధిత చరాస్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్ పోలీసులు. 10 గ్రాములు రూ.18 వేలకు అమ్ముతున్నట్టు తెలిపిన పోలీసులు .
  • మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం . ఆగ్నేయ బంగాళాఖాతంలో 1.5 కి.మీ ఎత్తువరకు కొనసాగుతున్న ఆవర్తనం. రాగల మూడు రోజులు పొడివాతావరణ-హైదరాబాద్ వాతావరణ కేంద్రం . రేపటి నుంచి నైరుతీ రుతుపవనాల ఉపసంహరణకు అనుకూల పరిస్థితులు. తమిళనాడు, పుదుచ్చేరి, కోస్తాంధ్ర, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో.. ఈశాన్య రుతుపవన వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం. -హైదరాబాద్ వాతావరణ కేంద్రం .
  • సిద్దిపేట: ఓట్ల కోసం బీజేపీ నేతలు తంటాలు పడుతున్నారు. హైడ్రామాతో ఓట్లు సంపాధించాలని చూస్తున్నారు- పద్మాదేవేందర్‌రెడ్డి. దుబ్బాక ప్రజలు చైతన్య వంతులు- ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ . ఎన్నికల సమయంలో అధికారులు సోదాలు చేయడం సహజం. దుబ్బాకలో టీఆర్‌ఎస్ విజయం ఖాయం- ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి.
  • విజయనగరం: పైడితల్లి అమ్మవారి పండుగలో రాజుల మధ్య వివాదం. సుధ గజపతి కుటుంబంకు ట్రస్ట్ చైర్‌పర్సన్ సంచయిత మధ్య వార్ . కోట బురుజుపై కూర్చోని సిరిమాను దర్శించుకోవడం రాజు కుటుంబీకుల ఆనవాయితీ. ముందుగానే కోట బురుజుపై చేరుకున్న ఆనంద గజపతి రెండో భార్య సుధ. సుధ గజపతితో పాటు ఆమె కూతురు ఊర్మిళా గజపతి . సుధ గజపతి కుటుంబం కోటపై కూర్చుంటే ట్రస్ట్ చైర్‌పర్స్‌న్‌ హోదాలో.. సంబరానికి వచ్చేదిలేదని తెగేసి చెప్పిన సంచయిత. సుధ గజపతి కుటుంబాన్ని కోటపై నుంచి కిందకు దింపమని అధికారులకు ఆదేశం. సుధ గజపతి కుటుంబాన్ని కిందకు దించడం కుదరదని చెప్పిన అధికారులు . చేసేదేమిలేక సుధ గజపతి కుటుంబంతో కలిసి సిరిమాను దర్శించుకున్న సంచయిత.
  • విజయవాడ: రాజధాని రైతులకు బేడీలు వేయడంపై మండిపడ్డ టీడీపీ పోలిట్‌ బ్యూరో సభ్యుడు బోండా ఉమ, మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని వెల్లడి .
  • ఢిల్లీ: బండి సంజయ్ అరెస్ట్‌ ఘటనపై స్పందించిన జాతీయ బీసీ కమిషన్ . పోలీసుల దురుసు ప్రవర్తనపై సుమోటోగా కేసు నమోదు. తెలంగాణ సీఎస్‌, డీజీపీకి నోటీసులు . నవంబర్ 5లోగా పూర్తి వివరాలు అందించాలని ఆదేశం . అధికారులు, పోలీసులపై ఎందుకు కేసు నమోదు చేయకూడదు. బండి సంజయ్ హక్కులను రక్షించడమే బీసీ కమిషన్ విధి. - నోటీసులో పేర్కొన్న జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి.
  • దేశ రాజధానిలో తిరిగి విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక్క రోజే దాదాపు 5 వేల కొత్త కేసులు నమోదు. అప్రమత్తం అయిన కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు. దసరా పండగ ఎఫెక్ట్ అంటున్న వైద్య నిపుణులు. 3 వేలకు పైగా కంటైన్మెంట్ జోన్లు. కోవిడ్ నిబంధనలను గాలికి వదిలేసిన దేశరాజధాని ప్రజలు.

తెలుగు రాష్ట్రాల వర్షాలపై సీఎంలతో ప్రధాని మోదీ ఆరా..!

భారీ వర్షపాతం కారణంగా తెలంగాణ, ఎపి పరిస్థితులకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు.

pm modi spoke to telugu states cms regarding the situation in respectively due to heavy rainfall, తెలుగు రాష్ట్రాల వర్షాలపై సీఎంలతో ప్రధాని మోదీ ఆరా..!

భారీ వర్షపాతం కారణంగా తెలంగాణ, ఎపి పరిస్థితులకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరమైతే మరిన్ని సహాయక చర్యలు చేపట్టాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మోదీ సూచించారు. రెస్క్యూ & రిలీఫ్ వర్క్ లో కేంద్రం నుండి సాధ్యమయ్యే అన్నివిధాల మద్దతు ఉంటుందన్న ప్రధాని.. అవసరమైన సహాయానికి హామీ ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలతో ప్రధాని ఫోన్లో మాట్లాడారు.

వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల ధాటికి తెలుగు రాష్ట్రాలు అల్లాడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం ధాటికి అతలాకుతలమైపోయింది. సరిగ్గా 20ఏళ్ల కిందట హైదరాబాద్‌లో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత ఈ స్థాయిలో హైదరాబాద్ పరిసరాల్లో వర్షం కురవడం ఇదే తొలిసారి. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాయుగుండం మంగళవారం ఉదయం నరసాపురం – కాకినాడ సమీపంలో తీరం దాటింది. ఆ ప్రభావంతో కృష్ణా, ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఫలితంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కృష్ణ నది తీర ప్రాంతాలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో కేంద్రం.. ఇరు రాష్ట్రాల సాయానికి ముందుకు వచ్చింది.

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఏపీలో వర్షాలు, అనంతర పరిస్థితులను సీఎం వైఎస్ జగన్ ను  అడిగితెలుసుకున్నారు. రాష్ట్రంలో వర్షప్రభావిత ప్రాంతాలు, నెలకొన్న పరిస్థితులను సీఎం ప్రధానికి వివరించారు. వాయుగుండం తీరందాటిందని, మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని వివరించారు. అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను ప్రధానికి వివరించారు.

Related Tags