ప్రధాని షేర్ చేసిన ఈ అద్భుత దృశ్యం ఎక్కడో తెలుసా ?

ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విట్టర్ ఖాతాలో ఓ అద్భుతమైన, సుందర దృశ్యాలను షేర్ చేశారు. అది చూసిన నెటిజన్లు ఫిదా అయిపోయితున్నారు. మోదీ షేర్ చేసిన ఆ వీడియోలో..

ప్రధాని షేర్ చేసిన ఈ అద్భుత దృశ్యం ఎక్కడో తెలుసా ?
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 26, 2020 | 12:09 PM

ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విట్టర్ ఖాతాలో ఓ అద్భుతమైన, సుందర దృశ్యాలను షేర్ చేశారు. అది చూసిన నెటిజన్లు ఫిదా అయిపోయితున్నారు. మోదీ షేర్ చేసిన ఆ వీడియోలో ఓ ఆలయంపై వర్షం కురుస్తుండగా…ఆ నీరంతా గుడి మెట్లపై పారుతూ..ఎంతో మనోహారంగా కనిపిస్తోంది. పాల సముద్రం పైకెగిసిందా అన్నంత అపురూపంగా అక్కడి జలదృశ్యం కనువిందు చేస్తోంది. అది గుజరాత్ లోని సూర్యదేవాలయంలో గల సూర్యకుండ్ దృశ్యాలు.

ఇకపోతే, ఈ సూర్యదేవాలయం గుజరాత్ లోని మహసానా జిల్లాలో గలదు. సోలంకి రాజైన రెండవ భీందేవ్ క్రీ.శ. 11 వశతాబ్దములో సూర్యదేవాలయం నిర్మించినట్లుగా తెలుస్తోంది. ఇది చోళరాజుల కాలం నాటిది. కనుచూపమేరలో కొండగానీ, రాయిగానీ లేనిచోట కొన్ని మైళ్ళ నుంచి రాయిని తొలచి నదికి 10 అడుగులకు పైగా ఇటుకలతో గట్టిపునాదులు వేయించి రాయిని దూలాలు, స్తంభాలు, మూర్తులుగా చిత్రికరించారట. ఎక్కడా సున్నంతో టాకీ వెయ్యకుండా రాయిలో రాయి అమర్చి నిర్మించిన ఒక అద్భుతమైన రాతిదేవాలయముగా ఇక్కడి సూర్య దేవాలయం ప్రసిద్ధి.

ఇక్కడి ఆలయ నిర్మాణం మూడు విధములుగా కనిపిస్తుంది అవి:

  •  గర్భాలయంతో కూడిన గూఢమంటపం
  • సభా లేక రంగమడటం ఇది ప్రత్యేకంగా పది ఆడుగుల దూరంలో విడిగా నిర్మించబడినది.
  • సూర్యకుండ్. ఇది స్నానములకు వినియోగించబడ్డ ఒక కొలను. ఈమూడు కట్టడాలు ఒకే వరుసలో తూర్పు పడమరలుగా ఏర్పాటు చేయబడ్డాయి.
  • వర్షంలో సూర్యకుండ్ దృశ్యాలనే ప్రధాని నరేంద్రమోదీ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు…ఆ వీడియోను మీరు చూడండి..

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.