Breaking News
  • ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని మార్చే హక్కు ఎవరికీ లేదు. సుప్రీంకోర్టు, రాష్ట్రపతి ఒప్పుకుంటేనే హైకోర్టు కదులుతుంది-కేశినేని. అమరావతి రక్షణకు పార్లమెంటు వేదికగా పోరాటం చేస్తాం-కేశినేని.
  • చిత్తూరు: తిరుచానూరు పీఎస్‌ నుంచి బేడీలతో పరారైన దొంగ. ట్రాక్టర్‌ దొంగతనం కేసులో నాగరాజును అరెస్ట్‌చేసిన పోలీసులు. దొంగ నాగరాజు కోసం గాలిస్తున్న పోలీసులు.
  • ఢిల్లీ: ఆప్‌ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు. నిర్భయ దోషులను రక్షించేందుకు ఆప్‌ ప్రభుత్వం యత్నిస్తోంది. కావాలనే న్యాయ ప్రక్రియను ఆలస్యం చేస్తోంది-మనోజ్‌ తివారీ. పోలీసులు తమ పరిధిలో లేరని తప్పించుకోవాలని ఆప్‌ చూస్తోంది -బీజేపీ ఢిల్లీ చీఫ్‌ మనోజ్‌ తివారీ.
  • అనంతపురం: తాడిపత్రిలో కత్తిపోట్లు. డబ్బుల విషయంలో స్నేహితుల మధ్య ఘర్షణ. రాము అనే వ్యక్తిని కత్తితో పొడిచిన రవితేజ. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిన రాము.
  • రైతులు కన్నీళ్లు పెట్టినా సీఎం మనసు కరగడం లేదు. రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుస్తోంది-దేవినేని ఉమ. విశాఖలో భూదందా నడుస్తోంది-మాజీ మంత్రి దేవినేని ఉమ. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం రాజధానిని విశాఖకు తరలిస్తున్నారు. పులివెందుల పులి డమ్మీ కాన్వాయ్‌తో వెళ్తోంది. దేశ చరిత్రలో డమ్మీ కాన్వాయ్‌తో వెళ్లిన సీఎం చరిత్రలో లేరు. సచివాలయానికి వెళ్లేందుకు మెటల్‌ రోడ్డు వేసుకుంటున్నారు. 5 కోట్ల మంది ప్రజలు రేపు రోడ్లపైకి రావాలి-దేవినేని ఉమ.

ఉగ్ర‌వాదానికి మారుపేరు పాక్ : ప్రధాని మోదీ

, ఉగ్ర‌వాదానికి మారుపేరు పాక్ : ప్రధాని మోదీ

మహారాష్ట్ర : పాకిస్తాన్ ఉగ్ర‌వాదానికి మారుపేరుగా మారింద‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. మ‌హారాష్ట్ర‌లోని య‌వ‌త్మాల్‌లో జ‌రిగిన స‌భ‌లో మాట్లాడుతూ ఆయ‌న ఈ విమ‌ర్శ‌లు చేశారు.  పుల్వామా ఘటన వల్ల తీవ్ర ఆగ్రహంగా ఉన్న ప్రధాని మోదీ.. పాకిస్తాన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దివాళ ద‌శ‌కు పాకిస్థాన్ చేరుకున్న‌ద‌ని, ఆ దేశం ఇప్పుడు ఉగ్ర‌వాదానికి మ‌రోపేరుగా మారింద‌ని అన్నారు.  పుల్వామాలో జ‌రిగిన దాడిలో సుమారు 40 మంది సీఆర్‌పీఎప్ జ‌వాన్లు మృత్యు వాత‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న ఎంతో వేద‌న‌కు గురిచేసింద‌ని, ఆ జ‌వాన్ల కుటుంబాలు ఎంత బాధ‌ప‌డుతున్నాయో మ‌నం అర్థం చేసుకోవ‌చ్చు అని మోదీ అన్నారు. మ‌హారాష్ట్ర‌కు చెందిన ఇద్ద‌రు జ‌వాన్లు కూడా ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయిన‌ట్లు తెలిపారు. వారి త్యాగం వృధాపోద‌న్నారు. ఇంత‌టి దారుణ ఘటనకు పాల్పడిన ఉగ్ర సంస్థ ఏదైనా.. వాళ్లు దాచుకుననేందుకు ఎంత ప్రయత్నించినా తప్పించుకుపోలేరన్నారు. ఉగ్ర‌మూక‌ల‌ను అణిచివేసేందుకు సైనిక బ‌ల‌గాల‌కు పూర్తి స్వేచ్ఛ‌ను ఇచ్చిన‌ట్లు ప్రధాని మోడీ తెలిపారు.