‘నేను టాయిలెట్ చౌకీదార్’… : మోదీ

వార్దా: ‘మై భీ చౌకీదార్’ నినాదంతో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ… తాజాగా మరో కొత్త నినాదం ఎత్తుకున్నారు. మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ‘టాయిలెట్ చౌకీదార్’ అంటూ కొత్త నినాదం వినిపించారు. వార్దాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ’ తాను టాయిలెట్లకు చౌకీదార్(కాపలాదారు) అని.. దానికి తాను చాలా గర్వపడుతున్నానని.. తద్వారా దేశ మహిళలకు రక్షణగా ఉంటున్నానని చెప్పారు. రెండు రోజుల క్రితం ఓ కాంగ్రెస్ నేత తనను ‘టాయిలెట్ […]

'నేను టాయిలెట్ చౌకీదార్'... : మోదీ
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 02, 2019 | 2:11 PM

వార్దా: ‘మై భీ చౌకీదార్’ నినాదంతో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ… తాజాగా మరో కొత్త నినాదం ఎత్తుకున్నారు. మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ‘టాయిలెట్ చౌకీదార్’ అంటూ కొత్త నినాదం వినిపించారు. వార్దాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ’ తాను టాయిలెట్లకు చౌకీదార్(కాపలాదారు) అని.. దానికి తాను చాలా గర్వపడుతున్నానని.. తద్వారా దేశ మహిళలకు రక్షణగా ఉంటున్నానని చెప్పారు. రెండు రోజుల క్రితం ఓ కాంగ్రెస్ నేత తనను ‘టాయిలెట్ చౌకీదార్’ అని విమర్శించారని.. ఇది దేశంలోని పారిశుద్ధ్య కార్మికులను అవమానించడం కాదా? అని మోదీ ప్రశ్నించారు. ఇక మీ విమర్శలే నాకు ఆభరణాలని ఆయన స్పష్టం చేశారు.

ఇకపోతే కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ గురించి ప్రస్తావిస్తూ.. పవార్ స్వయంగా ఓ రైతు అయి ఉండి.. ఇప్పుడు మహారాష్ట్ర రైతుల గురించి మర్చిపోవడమే కాదు.. వారి సమస్యలను కూడా పట్టించుకోవడం లేదని మోదీ విమర్శించారు. మన జవాన్ల వీరత్వాన్ని కాంగ్రెస్ శంకిస్తోందని ఆయన విమర్శించారు. ఇక ఇదే సభలో ఇస్రో శాస్త్రవేత్తలను మోదీ అభినందించారు. మన శాస్త్రవేత్తలు EMISAT శాటిలైట్‌ను విజయవంతంగా లాంచ్ చేసినందుకు గర్వంగా ఉందన్నారు.