మోదీ ఆస్తులు పెరిగాయ్.. షా ఆస్తులు తగ్గాయ్.. ఎవరికి ఎంత ఆస్తి ఉందంటే!

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆయన కేబినేట్‌లోని మంత్రులు ప్రతీ ఏటా తమ ఆస్తుల వివరాలను ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంవో)కు అందజేస్తుంటారు. ఈ ఏడాది కూడా అదే విధంగా సమర్పించారు.

మోదీ ఆస్తులు పెరిగాయ్.. షా ఆస్తులు తగ్గాయ్.. ఎవరికి ఎంత ఆస్తి ఉందంటే!
Follow us

|

Updated on: Oct 15, 2020 | 11:53 PM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆయన కేబినేట్‌లోని మంత్రులు ప్రతీ ఏటా తమ ఆస్తుల వివరాలను ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంవో)కు అందజేస్తుంటారు. ఈ ఏడాది కూడా అదే విధంగా సమర్పించారు. ఇక ఆ జాబితాలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. (PM Modi Net Worth)

ప్రధాని మోదీ నికర ఆస్తుల విలువ గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పెరిగినట్లు పీఎంవో వెల్లడించింది. ఈ ఏడాది జూన్ 30 నాటికి పీఎం మోదీ నికర ఆస్తుల విలువ రూ .2.85 కోట్లు.. గత ఏడాది రూ .2.49 కోట్లతో పోల్చితే దాదాపు రూ .36 లక్షలు పెరిగిందని ప్రకటించింది. గత సంవత్సర కాలంలో ఆయన చేసిన బ్యాంక్ డిపాజిట్స్, ఇన్‌వెస్ట్‌మెంట్స్ కారణంగా ఆస్తుల విలువ పెరిగినట్లు పీఎంవో తేల్చింది. జూన్ 2020 చివరి నాటికి, ప్రధాని మోదీ చేతిలో రూ .31,450 నగదు, ఎస్‌బీఐ గాంధీనగర్ ఎన్‌ఎస్‌సీ బ్రాంచ్‌లో రూ .3,38,173 బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయంది. అదే శాఖలో బ్యాంక్ ఎఫ్‌డిఆర్, ఎంఓడి బ్యాలెన్స్ 1,60,28,939 రూపాయలుగా ఉన్నాయని పీఎంవో తెలిపింది.

రూ. 8,43,124 విలువైన నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్, రూ. 1,50,957 విలువ చేసే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు, రూ. 20 వేలకు ఇన్ఫ్రా బాండ్స్ మోదీ కలిగి ఉన్నారు. అలాగే ప్రధానికి రూ. 1.75 కోట్లకు పైగా విలువ చేసే చరాస్తులు ఉన్నాయని పీఎంవో స్పష్టం చేసింది. ప్రధానమంత్రి ఎలాంటి రుణాలు తీసుకోకపోగా.. ఆయన పేరు మీద వాహనం కూడా లేదు. సుమారు 45 గ్రాములు బరువుండే నాలుగు బంగారు ఉంగరాలు మోదీ దగ్గర ఉన్నాయి. వాటి విలువ రూ .1.5 లక్షలు. వీటితో పాటు గాంధీనగర్ సెక్టార్ 1లో 3,531 స్క్వేర్ ఫీట్ ప్లాట్.. మరో ముగ్గురి భాగస్వామ్యంతో ఉందని మోదీ తమ ఆస్తుల్లో పేర్కొన్నారు.

ప్రధాని మోదీకి వ్యతిరేకంగా హోంమంత్రి అమిత్ షా నికర ఆస్తుల విలువ గతేడాదితో పోలిస్తే జూన్ 2020 నాటికి తగ్గిందని పీఎంవో అధికారులు వెల్లడించారు. షేర్ మార్కెట్‌లోని హెచ్చుతగ్గులు, మార్కెట్ సెంటిమెంట్ ప్రభావమే దీనికి కారణమని వారు అన్నారు. ఈ ఏడాది జూన్ 30 నాటికి అమిత్ షా నికర ఆస్తుల విలువ రూ .28.63 కోట్లు.. గత ఏడాది రూ .32.3 కోట్లతో పోల్చితే దాదాపు రూ .3.67 కోట్లు తగ్గిందని ప్రకటించింది. షా 10 స్థిరాస్తులు కలిగి ఉన్నారు. అలాగే ఆయన అధీనంలో ఉన్న ఆస్తులు, తల్లి నుంచి వారసత్వంగా పంచుకున్న ఆస్తుల విలువ రూ. 13.56 కోట్లని పీఎంవో తెలిపింది. అమిత్ షా చేతుల్లో రూ. 15,814 నగదు, రూ. 1.04 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్.. రూ. 13.47 లక్షల విలువ గల ఇన్సూరెన్స్, పెన్షన్ పాలిసీలు.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ స్కీమ్స్‌లో మరో రూ. 2.79 లక్షలు. రూ. 44.47 లక్షలు విలువ చేసే ఆభరణాలు ఉన్నాయి.

ఇక మోదీ కేబినేట్‌లోని మంత్రుల ఆస్తుల విలువ చూస్తే.. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ తనకు రూ. 1.97 కోట్ల చరాస్తులు, రూ. 2.97 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు ప్రకటించారు. అలాగే 32 రౌండ్ రివాల్వర్ ఒకటి, 2 పైప్ గన్స్ తన దగ్గర ఉన్నాయని పేర్కొన్నట్లు పీఎంవో తెలిపింది. ఇక ఆయన భార్య సావిత్రి సింగ్ వద్ద రూ. 54.41 లక్షల చరాస్తులు ఉన్నాయి.

రోడ్లు, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.. తనకు, తన భార్యకు, కుటుంబానికి కలిసి హిందూ అవిభాజ్య కుటుంబం కింద రూ. 2.97 కోట్ల చరాస్తులు ఉన్నట్లు తెలిపారు.. అలాగే సంయుక్తంగా రూ. 15.98 కోట్లు విలువ చేసే స్థిరాస్తులు ఉన్నాయని ప్రకటించారు. ఇక గడ్కరీ దగ్గర ఆరు వాహనాలు కూడా ఉన్నాయి.

మరోవైపు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్.. తమ దగ్గర రూ. 99.36 లక్షలు విలువ చేసే ఇల్లు ఉందని.. అలాగే రూ. 16.02 లక్షలు విలువ చేసే వ్యవసాయేతర భూమి ఉన్నట్లు తెలిపారు. అటు ఏపీ రిజిస్ట్రేషన్‌తో ఓ బజాజ్ చేతక్ స్కూటర్ ఉందని వెల్లడించారు. అలాగే రూ. 18.4 లక్షల చరాస్తులు ఉన్నాయని నిర్మలా సీతారామన్ ఆస్తుల ప్రకటనలో తెలిపారు. ఇక రైల్వే మినిస్టర్ పీయూష్ గోయల్.. రూ. 27.47 కోట్లు విలువ చేసే స్థిర చరాస్తులు ఉన్నాయని ప్రకటించారు. ఆయన భార్య సీమా గోయల్ ఆస్తుల విలువ రూ. 50.34 కోట్లు.. ఇక హిందూ అవిభాజ్య కుటుంబం కేటగిరీలో రూ. 45.65 లక్షల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. కాగా, పీయూష్ గోయల్ మోదీ కేబినేట్ మంత్రులలో అత్యంత ధనవంతుడు కావడం గమనార్హం.

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!