దేశానికి వ్యాక్సీన్ డెలివరీ సిస్టం అవసరం, ప్రధాని మోదీ

ఎన్నికలను ఎలా నిర్వహిస్తున్నామో అలాగే కరోనా వైరస్ వ్యాక్సీన్ డెలివరీకి ఓ సిస్టం అంటూ ఉండాలని ప్రధాని మోదీ అన్నారు. ఈ ప్రక్రియలో అన్ని స్థాయిల ప్రభుత్వ శాఖలు, ప్రజా బృందాలూ పాల్గొనేలా చూడాల్సి ఉందన్నారు.

  • Umakanth Rao
  • Publish Date - 6:24 pm, Sat, 17 October 20
దేశానికి వ్యాక్సీన్ డెలివరీ సిస్టం అవసరం, ప్రధాని మోదీ

ఎన్నికలను ఎలా నిర్వహిస్తున్నామో అలాగే కరోనా వైరస్ వ్యాక్సీన్ డెలివరీకి ఓ సిస్టం అంటూ ఉండాలని ప్రధాని మోదీ అన్నారు. ఈ ప్రక్రియలో అన్ని స్థాయిల ప్రభుత్వ శాఖలు, ప్రజా బృందాలూ పాల్గొనేలా చూడాల్సి ఉందన్నారు. వ్యాక్సీన్ అందుబాటు లోకి రాగానే.. దాని డెలివరీ, పంపిణీ ఏర్పాట్లపై చర్చించేందుకు శనివారం జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించిన ఆయన…దేశ జనాభాలో ప్రతి వ్యక్తికీ వ్యాక్సీన్ అందుబాటులో ఉండాలని సూచించారు. ఇందుకు విధివిధానాలను రూపొందించేటప్పుడు..దేశ భౌగోళిక పరిస్థితులను, డైవర్సిటీని పరిగణనలోకి తీసుకోవాలని అధికారులకు సజెస్ట్ చేశారు. టీకా డోసుల కోల్డ్ స్టోరేజీ, వ్యాక్సినేషన్ క్లినిక్ ల పర్యవేక్షణకు మెకానిజం తదితర అంశాల మీద తగిన ప్లానింగ్ ఉండాలని కూడా మోదీ పేర్కొన్నారు.

దేశ ఎన్నికల వ్యవస్థను ఒకసారి పరిశీలించి ఆ టైపులో ఈ వ్యాక్సీన్ పంపిణీ, అందుకు తగిన  ఏర్పాట్లపై  ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలని ఆయన కోరారు.