Breaking News
  • విశాఖలో లైట్‌మెట్రోకు డీపీఆర్‌లు రూపొందించాలని ఆదేశాలు. ఏఎంఆర్సీని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ. 79.91 కిలోమీటర్ల మేర లైట్‌మెట్రోకు ప్రతిపాదనలు. డీఎంఆర్సీ, రైట్స్, యూఎంటీసీ నుంచి సలహాలు తీసుకోవాలని ఆదేశం. 60.2 కి.మీ. మోడ్రన్‌ ట్రామ్‌ కారిడార్స్ ఏర్పాటుకు డీపీఆర్‌లు. డీఎంఆర్సీ, రైట్స్, యూఎంటీసీల నుంచి డీపీఆర్‌లు ఆహ్వానించాలని ఆదేశం.
  • నిర్భయ దోషులను విడివిడిగా ఉరితీయాలంటూ.. సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన కేంద్ర హోంశాఖ. ఇప్పటికే తీర్పును రిజర్వ్‌ చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం. రేపు తీర్పు ఇవ్వనున్న జస్టిస్‌ భానుమతి నేతృత్వంలోని.. ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం.
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 5 గంటల సమయం. ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.67 కోట్లు. సాయంత్రం వరకు శ్రీవారిని దర్శించుకున్న 46,448 మంది భక్తులు.
  • విశాఖ: పాయకరావుపేటలో హెటిరో ఉద్యోగి ఒంటెద్దు రాజు ఉరి వేసుకుని ఆత్మహత్య, మృతుడు తూ.గో.జిల్లా పెదపట్నం లంక వాసి.
  • ఢిల్లీ చేరుకున్న ట్రంప్‌ దంపతులు. ఎయిర్‌పోర్ట్‌లో ట్రంప్‌ దంపతులకు ఘనస్వాగతం. ఐటీసీ మౌర్య హోటల్‌లో ట్రంప్‌ దంపతుల బస. ఢిల్లీలో భారీగా భద్రతా ఏర్పాట్లు. ట్రంప్‌ బస చేసిన హోటల్‌ దగ్గర పటిష్ట భద్రత.

‘ నమామి గంగే ‘ … గంగా ప్రక్షాళనపై ప్రధాని మోదీ సమీక్ష

PM Modi to cruise on Ganga, ‘ నమామి గంగే ‘ … గంగా ప్రక్షాళనపై ప్రధాని మోదీ సమీక్ష

గంగానది ప్రక్షాళనపై ప్రధాని మోదీ దృష్టి సారించారు. ‘ నమామి గంగే ‘ పేరిట చేపట్టిన ప్రాజెక్టు పురోగతిమీద శనివారం కాన్పూర్ లో జరిగిన సమావేశంలో ఆయన సమీక్షించారు. ‘ నేషనల్ కౌన్సిల్ ఫర్ గంగ ‘ నిర్వహించిన తొలి సమావేశమిది.. ఈ మీటింగ్ లో యూపీ, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, త్రివేంద్ర సింగ్ రావత్, బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ, ఇంకా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు పనులు ఎంతవరకు వచ్చాయో తెలుసుకున్న మోదీ.. సంబంధిత రాష్ట్రాల సీఎం లకు, అధికారులకు తగిన సూచనలు, సలహాలిచ్చారు. ఈ సమావేశానికి ముందు గంగానది ప్రక్షాళనపై ‘ నమామి గంగ మిషన్ ‘ నిర్వహించిన ఎగ్జిబిషన్ ను ఆయన తిలకించారు. గత కొన్నేళ్లుగా ఈ ప్రాజెక్టు కింద చేబట్టిన పనులను చూసేందుకు ఆయన గంగా బ్యారేజీ సమీపంలో కొత్తగా నిర్మించిన ‘ అటల్ ఘాట్ ‘ ను విజిట్ చేస్తారని, అతి పెద్ద డ్రైన్ వద్ద ఈ మధ్యే ఏర్పాటు చేసిన ‘ సెల్ఫీ పాయింట్ ‘ లో ‘ సెల్ఫీ ‘ దిగుతారని తెలుస్తోంది. అటు మోదీ శనివారం మధ్యాహ్నం గంగానదిలో కొద్దిసేపు బోటులో ప్రయాణించారు. ఆయన వెంట యూపీ, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులు.. బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీతో సహా ఈ రెండు రాష్ట్రాల అధికారులు ఉన్నారు. గంగానది ప్రక్షాళనకు కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కాగా- శుక్రవారం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా ఈ ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించి.. పనుల పురోగతిపై అధికారులనుంచి వివరాలు తెలుసుకున్నారు.

 

Related Tags