నీతి ఆయోగ్‌కు వివేక్ దేవరాయ్ రాజీనామా!

ప్రముఖ ఆర్ధికవేత్త డాక్టర్ వివేక్ దేవరాయ్ నీతి ఆయోగ్ నుంచి తప్పుకున్నారు. తన పూర్తి కాల సభ్యుత్వానికి ఆయన రాజీనామా చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చైర్మన‌్‌గా నీతి ఆయోగ్ పునర్వ్యవస్థీకరణ జరిగిన సంగతి విదితమే. వివేక్ దేవరాయ్.. 1997 నుంచి 2005 వరకు రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాన్‌టెంపరరీ స్టడీస్‌లో పనిచేశారు. ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన ఓ మ్యాగజైన్‌‌లో నాటి సీఎం నరేంద్ర మోదీ నేతృత్వంలోని గుజరాత్ ప్రభుత్వాన్ని ప్రశంసించడంతో ఆయనను ఉద్యోగం నుంచి […]

నీతి ఆయోగ్‌కు వివేక్ దేవరాయ్ రాజీనామా!
Follow us

| Edited By:

Updated on: Jun 08, 2019 | 5:07 PM

ప్రముఖ ఆర్ధికవేత్త డాక్టర్ వివేక్ దేవరాయ్ నీతి ఆయోగ్ నుంచి తప్పుకున్నారు. తన పూర్తి కాల సభ్యుత్వానికి ఆయన రాజీనామా చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చైర్మన‌్‌గా నీతి ఆయోగ్ పునర్వ్యవస్థీకరణ జరిగిన సంగతి విదితమే. వివేక్ దేవరాయ్.. 1997 నుంచి 2005 వరకు రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాన్‌టెంపరరీ స్టడీస్‌లో పనిచేశారు. ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన ఓ మ్యాగజైన్‌‌లో నాటి సీఎం నరేంద్ర మోదీ నేతృత్వంలోని గుజరాత్ ప్రభుత్వాన్ని ప్రశంసించడంతో ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు. అనంతరం ఆయన 2007 నుంచి 2015 వరకు పలు పుస్తకాలు రాయడంతో పాటు అనేక పత్రికలకు కన్సల్టింగ్ ఎడిటర్‌గా కొనసాగారు. పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో ఏడాది కాలంపాటు పనిచేశారు. సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్‌లో కూడా కొనసాగారు. నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2015లో ఆయనను నీతి ఆయోగ్ పదవికి ఎంపిక చేశారు. కాగా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా డాక్టర్ రాజీవ్ కుమార్ కొనసాగనున్నారు.