స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి అరుదైన గుర్తింపు

సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ మహోన్నత విగ్రహం స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీకి అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలోని వంద గొప్ప ప్రదేశాల్లో గుజరాత్‌లోని నర్మదా నది మధ్యలో నిర్మించిన సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ భారీ విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి స్థానం లభించింది. ప్రఖ్యాత “టైమ్‌’ మ్యాగజైన్‌ భారత్‌లోని సర్దార్‌ మహోన్నత విగ్రహనికి స్థానం కల్పించింది. “టైమ్‌’ మ్యాగజైన్‌ “ప్రపంచ మహోన్నత సందర్శనీయ స్థలాలు – 2019′ పేరిట ఓ జాబితా రూపొందించింది. అనేక దేశాల్లో నూతనంగా రూపొందించిన […]

స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి అరుదైన గుర్తింపు
Follow us

| Edited By:

Updated on: Aug 28, 2019 | 8:25 PM

సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ మహోన్నత విగ్రహం స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీకి అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలోని వంద గొప్ప ప్రదేశాల్లో గుజరాత్‌లోని నర్మదా నది మధ్యలో నిర్మించిన సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ భారీ విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి స్థానం లభించింది. ప్రఖ్యాత “టైమ్‌’ మ్యాగజైన్‌ భారత్‌లోని సర్దార్‌ మహోన్నత విగ్రహనికి స్థానం కల్పించింది. “టైమ్‌’ మ్యాగజైన్‌ “ప్రపంచ మహోన్నత సందర్శనీయ స్థలాలు – 2019′ పేరిట ఓ జాబితా రూపొందించింది. అనేక దేశాల్లో నూతనంగా రూపొందించిన 100 గొప్ప ప్రదేశాలతో ఈ జాబితా తయారు చేసింది. అందులో స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీకి స్థానం కల్పించింది. టైమ్స్‌ జాబితాలో ఈ విగ్రహనికి చోటు కల్పించడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు.  నర్మదా నది మధ్యలో సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌కు అభిముఖంగా నిర్మించిన ఈ విగ్రహం ఎత్తు 182 మీటర్లు.