Breaking News
  • ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై కౌంటర్‌ దాఖలు చేసిన ప్రభుత్వం. నిరాధార ఆరోపణలతో ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. ఆత్మహత్యలకు కారణాలను దర్యాప్తు సంస్థలు తేల్చాల్సి ఉంది. చట్టప్రకారం చర్యలు చేపట్టాలని కార్మికశాఖ కమిషనర్‌ను ఇప్పటికే హైకోర్టు ఆదేశించిందన్న సీఎస్‌. కార్మికుల జీతాలు సహా ఇతర డిమాండ్లపై కార్మికశాఖ కమిషనర్‌ తగిన చర్యలు తీసుకుంటారన్న సీఎస్‌.
  • ఏపీ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌లో భారీగా నిధుల దుర్వినియోగం. మాజీ సెక్రటరీ చౌదరి సహా కొందరు సభ్యులపై కేసు నమోదు. నిధులు దుర్వినియోగం అయినట్టు రుజువుకావడంతో పున్నయ్య చౌదరిని అరెస్ట్‌చేసిన పోలీసులు.
  • విజయవాడ: సీఎం జగన్‌ పాలనతో సహకారం రంగం విరాజిల్లుతోంది. 2004లో స్వర్గీయ వైఎస్‌ఆర్‌ కోఆపరేటివ్‌ వ్యవస్థను బలోపేతం చేశారు. సహకారం రంగాన్ని టీడీపీ ప్రభుత్వం కుదేలు చేసింది. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం అండగా ఉంటుంది. రాజకీయ నాయకుల లాగా ఉద్యోగులు యూనియన్లు మారొద్దు-మంత్రి పేర్ని నాని. సహకార వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. రైతులకు అన్ని విధాలుగా సహకరించి రుణాలు అందించాలి-మంత్రి వెల్లంపల్లి
  • సిద్దిపేట: హుస్నాబాద్‌లో మోడల్‌ స్కూల్‌ను తనిఖీ చేసిన హరీష్‌రావు. చన్నీళ్లతో స్నానం చేస్తున్నామని మంత్రికి విన్నవించిన విద్యార్థులు. వాటర్‌ హీటర్‌ను వెంటనే రిపేర్‌ చేయించాలని ప్రిన్సిపాల్‌కు ఆదేశం. పిల్లలకు త్వరలో దుప్పట్లు పంపిణీ చేస్తానని హామీ.
  • తిరుపతి: కేరళ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే రైలులో నీటి కొరత. ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు. నరక యాతన పడుతున్న అయ్యప్ప భక్తులు, ప్రయాణికులు. రైలును రేణిగుంట స్టేషన్‌లో ఆపేసిన ప్రయాణికులు.
  • మున్సిపల్‌ ఎన్నికలపై హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసిన ప్రభుత్వం. పిటిషన్లన్నీ కొట్టివేయాలని సింగిల్‌ జడ్జిని కోరిన ప్రభుత్వం. పిటిషన్లపై ఇప్పటికే ధర్మాసనం విచారణ జరిపిందన్న ప్రభుత్వం. ప్రజా ప్రయోజన పిటిషన్లను ఇప్పటికే ధర్మాసనం కొట్టివేసిందన్న ప్రభుత్వం.
  • గుంటూరు: ఎస్పీ విజయరావుకు జనసేన ఫిర్యాదు. జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఫిర్యాదు. వాస్తవాలు పరిశీలించి న్యాయం చేయాలని విజ్ఞప్తి. ధర్మవరం ఘటనపై పూర్తి విచారణ చేపడతాం-ఎస్పీ విజయరావు. పోలీసులపై దాడి చేసిన వారిపైనే చర్యలు తీసుకుంటాం. అనవసర వివాదాలకు గ్రామస్తులు దూరంగా ఉండాలి-ఎస్పీ విజయరావు.
  • తూ.గో: అంతర్వేది బీచ్‌లో చోరీ. కారులో నుంచి బంగారు నగలు ఎత్తుకెళ్లిన దుండగులు. నగల విలువ రూ.3 లక్షలు ఉంటుందన్న బాధితులు. పీఎస్‌లో ఫిర్యాదు చేసిన బాధితుడు సూర్యనారాయణ.

ప్రధాని గుర్తించలేదా..? పర్లేదు..ప్రపంచమే గుర్తించింది..!

PM Bollywood interaction: South feels ignored, ప్రధాని గుర్తించలేదా..? పర్లేదు..ప్రపంచమే గుర్తించింది..!

బాహుబలి..తెలుగు సినిమా పవర్‌ని ప్రపంచానికి చాటిన సినిమా. జక్కన్న చెక్కిన విజువల్ వండర్‌కి ప్రపంచం మొత్తం సాహో అంది. ప్రపంచలోని అనేక దేశాలలో కూడా ‘బాహుబలి’ సింహనాదం చేసింది. ఇండియన్ సినిమాకి ఎన్నో గౌరవవాలు ఈ చిత్రం అందించింది. బాహుబలి ద్వారా తెలుగు సినిమా దశ దిశను మార్చిన దర్శకుడు రాజమౌళి. తెలుగు సినిమా గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలా చేసిన ఘనత ఈ దర్శక ధీరుడిదే. ఇండియన్ స్క్రీన్ పై మునుపెన్నడూ చూడని విజువల్స్ ని తో వచ్చిన ఈ దృశ్యకావ్యానికి ఎన్నో పురస్కారాలు వచ్చాయి.

తాజాగా లండన్ లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్ కు 148 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉండగా.. ఇన్నేళ్ల చరిత్రలో అక్కడ ప్రదర్శితమైన తొలి ఇంగ్లీషేతర చిత్రంగా  కూడా మన ‘బాహుబలి’ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. అంతే కాదు ఈ హాల్‌లో రాజమౌళి సాంప్రదాయ పంచె కట్టులో మెరిశాడు. భుజం మీద కండువాతో కనిపించి కనువిందు చేశాడు. తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేయడమే కాదు ఆ ప్రపంచ వేదికపై తెలుగు సాంప్రదాయాన్ని కూడా పరిచయం చేశాడు. హాలీవుడ్ సినిమాలకు కూడాా లేని స్థాయిలో  రాయల్ ఆల్బర్ట్ హాల్ లో నెలకొన్న సందడి చూసి నిర్వాహకులు సైతం ఆశ్చర్యపోయారు. ఇదీ సౌత్ సినిమా స్థాయి.

ఇలా పక్కదేశాలలో కూడా మన సినిమాని మెచ్చుకుంటుంటే స్వదేశంలో మాత్రం చిన్నచూపు చూస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. దేశ ప్రధాని కూడా మన సౌత్ సినిమా ప్రముఖులను గుర్తించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకల్లో భాగంగా స్వచ్ఛ భారత్ ఇతర కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన పెంచే ఉద్దేశంతో ఆయన సినీ పరిశ్రమతో చర్చించేందుకు వారిని ఆహ్వానించారు. అయితే అక్కడ అన్నీ బాలీవుడ్ ముఖాలే కనిపించాయి. సౌత్ నుంచి ఇన్విటేషన్ అందుకున్నవారు కూడా పెద్దగా ఎవరూ లేరని సమాచారం. మన ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు వెళ్లినా..ఒకవైపు బాలీవుడ్ జనాలు ప్రధానితో ఫోటోలు దిగుతంటే..ఈయన మాత్రం దూరంగా నిలుచుండిపోయారు.

అసలు దక్షిణాదిపై ఇంత చిన్నచూపు ఎందుకనేది చాలామంది వాదన. ఇప్పటికే ఈ భేదం చూపిస్తున్నారన్న ప్రచారం ఉన్న నేపథ్యంలో..ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి వాటిని రూపుమాపే విధంగా అడుగులు వేయాలి. కానీ ప్రస్థుత పరిస్థితులు తారతమ్యాలు ఉన్నాయన్న ధోరణికి మరింత ఆజ్యం పోశాయి. వాస్తవానికి సౌత్ సినిమాలు, దర్శకులు ఇప్పుడు చూపిస్తున్న ఇంపాక్ట్ అసమాన్యమైనది. ఎంతలా అంటే బాలీవుడ్ అగ్ర హీరోలు సైతం ఇక్కడి సినిమాలను రీమేక్ చేస్తూ.. మన దర్శకులతో సినిమాలు డైరెక్ట్ చేయిస్తూ హిట్స్ వెనకేసుకుంటున్నారు. అలాగని వారిని తక్కువ చేస్తున్నామని కాదు..టాలెంట్, క్రియేటివిటీ ఎక్కడున్నా గుర్తించాల్సిన అవసరం ఉంది.  ఇంకెన్ని “బాహుబలి’ లాంటి సినిమాలు వస్తే సౌత్ సినిమా సత్తా తెలుస్తుందో ?. డియర్ మేకర్స్ మీరే చూపించాలి..మన స్థాయి..స్థానం.