చైనీయులకు గట్టి సమాధానం ఇచ్చాం.. ప్రధాని మోదీ

లడాఖ్ లో మన భూభాగంపై కన్నేసిన చైనా దళాలకు గట్టి సమాధానం ఇచ్చామని ప్రధాని మోదీ అన్నారు. గాల్వన్ వ్యాలీలో ఈ నెల 15 న చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు మృతి చెందిన ఘటనను ఆయన ప్రస్తావిస్తూ..

చైనీయులకు గట్టి సమాధానం ఇచ్చాం.. ప్రధాని మోదీ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 28, 2020 | 12:43 PM

లడాఖ్ లో మన భూభాగంపై కన్నేసిన చైనా దళాలకు గట్టి సమాధానం ఇచ్చామని ప్రధాని మోదీ అన్నారు. గాల్వన్ వ్యాలీలో ఈ నెల 15 న చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు మృతి చెందిన ఘటనను ఆయన ప్రస్తావిస్తూ.. అమరులైన వారి త్యాగాలు చిరస్మరణీయమన్నారు. ఆదివారం ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన .. మన దేశానికి ఇతర దేశాలతో ఎలా స్నేహం చేయాలో, అవసరమైనప్పుడు ఎలా ఎదుర్కోవాలో కూడా తెలుసునన్నారు. మన మాతృభూమిపై ఎవరు కన్నేసినా మన సైనికులు సహించబోరన్నారు. తమ సైనికుల్లో 45 మంది మరణించారని మొదట చెప్పుకున్న చైనా .. ఆ తరువాత తమ కల్నల్ కూడా మృతి చెందినవారిలో ఉన్నారని స్పష్టం చేసిందని ఆయన పేర్కొన్నారు.

భారత్ స్వావలంబన సాధించేందుకు ఇదే సమయమని, ప్రస్తుతం దేశం అన్ లాక్ దశలో ఉందని, బొగ్గు, అంతరిక్షం, వ్యవసాయం వంటి అనేక రంగాల్లో మనం కలిసికట్టుగా ఇంకా అభివృధ్ది సాధన దిశగా  ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని మోదీపేర్కొన్నారు. సాంకేతికంగా కూడా దేశం ముందుకు వెళ్తోందన్నారు. వలస కార్మికులు మళ్ళీ తమ ఉపాధి పనుల్లోబిజీ అయ్యారు. యూపీలోని బారాబంకీ లో అనేకమంది కళ్యాణి నది వద్ద తమ పనులను కొనసాగిస్తున్నారు,. ఐసోలేషన్ లో ఉన్నప్పుడు తమ జీవితాలను వారు ఎలా మార్చుకున్నారో చూడండి అన్నారు.