మోదీ ప్రసంగంలో శానిటరీ పాడ్స్ ప్రస్తావన, పలువురి ఆశ్చర్యం

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ..మహిళల ఆరోగ్యాన్ని గురించి ప్రస్తావించి శానిటరీ న్యాప్ కిన్స్ పై ప్రకటన చేయడం..

మోదీ ప్రసంగంలో శానిటరీ పాడ్స్ ప్రస్తావన, పలువురి ఆశ్చర్యం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 15, 2020 | 7:40 PM

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ..మహిళల ఆరోగ్యాన్ని గురించి ప్రస్తావించి శానిటరీ న్యాప్ కిన్స్ పై ప్రకటన చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇప్పటివరకు ఏ ప్రధాని ఈ అంశంపై ఇలా పేర్కొనలేదు. అయితే ఆ సంప్రదాయాన్ని పక్కన బెట్టిన మోదీ ..’ప్రధానమంత్రి జన ఔషధీ కేంద్ర పథకం’ కింద ప్రభుత్వం ఒక్క రూపాయికే ఈ న్యాప్ కిన్స్ ని ఇవ్వడం ప్రారంభించిందన్నారు. ఇది మహిళల ఆరోగ్యానికి తోడ్పడుతుందని చెబుతూ.. ఆరు వేల జన ఔషధీ కేంద్రాల్లో కేవలం తక్కువ సమయంలో 5 కోట్లకు పైగా న్యాప్ కిన్లను అందజేయడం జరిగిందన్నారు.

కాగా పలువురు యూజర్లు ఈ ప్రకటన పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.