రైతు చట్టం అతనికి వరమైంది, మహారాష్ట్రలోని ధూలే జిల్లా అన్నదాత కథనంపై మోదీ !

కేంద్రం అమలు చేస్తున్న రైతు చట్టాలవల్ల అన్నదాతలకు కలిగే ప్రయోజనాలను ప్రధాని మోదీ తన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో వివరించారు. మహారాష్ట్ర లోని ధూలే జిల్లాలో జితేంద్ర బోయి అనే రైతు ఈ చట్టాన్ని ఎలా ఉపయోగించుకుని..

రైతు చట్టం అతనికి వరమైంది, మహారాష్ట్రలోని ధూలే జిల్లా అన్నదాత కథనంపై మోదీ !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 29, 2020 | 2:38 PM

కేంద్రం అమలు చేస్తున్న రైతు చట్టాలవల్ల అన్నదాతలకు కలిగే ప్రయోజనాలను ప్రధాని మోదీ తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో వివరించారు. మహారాష్ట్ర లోని ధూలే జిల్లాలో జితేంద్ర బోయి అనే రైతు ఈ చట్టాన్ని ఎలా ఉపయోగించుకుని ప్రయోజనం పొందాడో ఆయన గుర్తు చేశారు. తన మొక్కజొన్న పంట సాగు చేసి దాన్ని వ్యాపారులకు సరైన ధరకు అమ్మాలని ఆయన నిర్ణయించుకున్నాడని, పంట మొత్తం ఖర్చు 3 లక్షల 32 వేల రూపాయలని నిర్ధారించుకున్నాడని మోదీ చెప్పారు. మొదట అతనికి 25 వేల రూపాయల అడ్వాన్స్ కూడా లభించిందని, మిగిలిన సొమ్మును వ్యాపారులు  కొంత 15 రోజుల్లోగా చెల్లించినప్పటికీ ఆ తరువాత పరిస్థితుల కారణంగా ఇవ్వలేకపోయారని ఆయన పేర్కొన్నారు. నాలుగు నెలలు గడిచినా జితేంద్ర బోయికి సొమ్ము అందలేదని, దీంతో ఆయన రైతు చట్టాల మేరకు అధికారులకు ఫిర్యాదు చేశాడని మోదీ అన్నారు. ఈ ఫిర్యాదుతో వ్యాపారులు కొన్ని రోజుల్లోనే అతనికి అతని డబ్బు చెల్లించారని వెల్లడించారు. ఇలాగే ఈ చట్టాలవల్ల మరొకరు పొందిన ప్రయోజనాన్ని కూడా మోదీ తెలియజేశారు. మొత్తం మీద ఇవి అన్నదాతలకు ఉపయోగపడేవే తప్ప వారికి హాని కలిగించేవి కావన్నారు.