బీహార్ ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ..!

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయపార్టీలు ప్రచారానికి పదును పెడుతున్నారు.

బీహార్ ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ..!
Follow us

|

Updated on: Oct 14, 2020 | 6:33 PM

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయపార్టీలు ప్రచారానికి పదును పెడుతున్నారు. అధికార ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఓడించేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు విమర్శనాస్త్రాలను సిద్ధం చేస్తున్నారు. మరోవైపు ఎన్డీఏ పక్షాలు ప్రధాని నరేంద్ర మోదీనే ఎన్నికల ప్రచారానికి దింపాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 22న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన‌నున్న‌ట్లు స‌మాచారం.

నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) మళ్లీ బీహార్ లో పాగా వేసేందుకు ఫ్లాన్ చేస్తోంది. పార్టీకి అతిపెద్ద స్టార్ క్యాంపెయిన‌ర్ ప్ర‌ధాని మోదీనే అని బీజేపీ భావిస్తుంది. అభ్యర్థులకు మద్దతుగా ప్ర‌ధాని తొలి ఎన్నిక‌ల ర్యాలీలో పాల్గొని ప్ర‌సంగించ‌నున్నారు. బ‌క్స‌ర్‌, జెహానాబాద్‌, రోహ్తాస్‌, భాగ‌ల్పూర్‌లో ఎన్డీయే అభ్య‌ర్థుల‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌ధాని ఎన్నిక‌ల ర్యాలీలో పాల్గొన‌నున్న‌ట్లు బీజేపీ వ‌ర్గాలు వెల్లడించారు. పీఎంవో నుంచి అనుమ‌తి వ‌చ్చిన వెంట‌నే ర్యాలీ, స‌భా ఏర్పాట్లు చేయ‌నున్న‌ట్లు ఆ పార్టీ నాయ‌కులు పేర్కొన్నారు. 243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీకి మూడు ద‌శ‌ల్లో పోలింగ్ జ‌ర‌గ‌నుంది. అక్టోబ‌ర్ 28, న‌వంబ‌ర్ 3, న‌వంబ‌ర్ 7న మూడు ద‌శ‌ల్లో పోలింగ్‌ను నిర్వ‌హించి న‌వంబ‌ర్ 10న ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన ఎన్డీఏ ప్రచారంలో దూసుకుపోతోంది.