‘జన జీవన్ మిషన్’ : గ్రామీణుల ఇళ్ళకు కొళాయిల ద్వారా నీరు సరఫరా.. అమ్మలు అక్కచెల్లెళ్ళ జీవితాలు సుఖవంతమవుతున్నాయన్న మోదీ

దేశవ్యాప్తంగా గ్రామీణ నీటి సరఫరా ప్రాజెక్టులు స్వయం సమృద్ధ గ్రామాలు, స్వయం సమృద్ధ భారత దేశం కోసం జరుగుతున్న కృషికి దోహదపడుతున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గ్రామాల్లో మంచినీటి సరఫరా వల్ల గ్రామీణ మహిళల జీవితాలు, పేదల ఆరోగ్యం మెరుగుపడుతున్నాయని మోదీ చెప్పారు. ఉత్తర ప్రదేశ్‌లోని మీర్జాపూర్, సోన్‌భద్ర జిల్లాల్లో గ్రామీణ తాగునీటి సరఫరా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అనంతరం మోదీ మాట్లాడుతూ.. ‘జన జీవన్ మిషన్’ పథకం క్రింద గ్రామీణుల ఇళ్ళకు కొళాయిల […]

'జన జీవన్ మిషన్' : గ్రామీణుల ఇళ్ళకు కొళాయిల ద్వారా నీరు సరఫరా.. అమ్మలు అక్కచెల్లెళ్ళ జీవితాలు సుఖవంతమవుతున్నాయన్న మోదీ
Follow us

|

Updated on: Nov 22, 2020 | 3:32 PM

దేశవ్యాప్తంగా గ్రామీణ నీటి సరఫరా ప్రాజెక్టులు స్వయం సమృద్ధ గ్రామాలు, స్వయం సమృద్ధ భారత దేశం కోసం జరుగుతున్న కృషికి దోహదపడుతున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గ్రామాల్లో మంచినీటి సరఫరా వల్ల గ్రామీణ మహిళల జీవితాలు, పేదల ఆరోగ్యం మెరుగుపడుతున్నాయని మోదీ చెప్పారు. ఉత్తర ప్రదేశ్‌లోని మీర్జాపూర్, సోన్‌భద్ర జిల్లాల్లో గ్రామీణ తాగునీటి సరఫరా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అనంతరం మోదీ మాట్లాడుతూ.. ‘జన జీవన్ మిషన్’ పథకం క్రింద గ్రామీణుల ఇళ్ళకు కొళాయిల ద్వారా నీరు సరఫరా అవుతోందని, దీనివల్ల మన అమ్మలు, అక్కచెల్లెళ్ళ జీవితాలు సుఖవంతమవుతున్నాయని చెప్పారు.

దీని ప్రధాన ప్రయోజనం పేదల ఆరోగ్యం మెరుగుపడటమేనన్నారు. మలినాలు నిండిన నీటి వల్ల అనేక రోగాలు వస్తాయని, సురక్షిత నీటి సరఫరా కారణంగా ఈ రోగాలు తగ్గుతున్నాయని మోదీ చెప్పారు. గిరిజన గ్రామాల ప్రజల జీవన శైలికి అనుగుణంగా ఇళ్లను నిర్మించుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు తగిన నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను గ్రామస్తులకే కల్పిస్తే, గ్రామంలోని ప్రతి ఒక్కరి ఆత్మవిశ్వాసం పెరుగుతుందని మోదీ అన్నారు.