బీహార్ పై ప్రధాని మోదీ వరాల జల్లు, 9 హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన

బీహార్ రాష్ట్రం అన్ని విధాలా అభివృధ్ది చెందడానికి కేంద్రం  సహాయపడుతుందని ప్రధాని మోదీ హామీ నిచ్చారు. అక్టోబర్-నవంబర్ నెలల్లో ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆయన...

బీహార్ పై ప్రధాని మోదీ వరాల జల్లు, 9 హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 21, 2020 | 7:05 PM

బీహార్ రాష్ట్రం అన్ని విధాలా అభివృధ్ది చెందడానికి కేంద్రం  సహాయపడుతుందని ప్రధాని మోదీ హామీ నిచ్చారు. అక్టోబర్-నవంబర్ నెలల్లో ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆయన… ఈ మధ్యకాలంలో ఈ స్టేట్ పై ప్రధానంగా దృష్టి పెట్టారు. సోమవారం మోదీ..రూ. 14,258 కోట్ల విలువైన 9  హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఆప్టికల్ ఫైబర్ ఇంటర్నెట్ సర్వీసులను లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఈ హైవే ప్రాజెక్టుల వల్ల రాష్ట్రం ముఖ్యంగా రవాణా రంగంలో ఎంతగానో పురోగతి చెందుతుందన్నారు. వ్యవసాయ బిల్లులకు పార్లమెంట్ ఆమోదం లభించడం రైతులకు ఎంతో ప్రయోజనకరమవుతుందన్నారు. ఈ విధంగా అన్నదాతల రుణం తీర్చుకోగలుగుతున్నామని ఆయన చెప్పారు. ఆప్టికల్ ఫైబర్ ఇంటర్నెట్ సర్వీసుల కారణంగా ప్రతి గ్రామంలో బ్రాడ్ బ్యాండ్ సేవలను విస్తరించగలుగుతామని మోదీ పేర్కొన్నారు. అటు-వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం నితీష్ కుమార్ కూడా పాల్గొన్నారు.