నాటి లోంగేవాలా యుధ్ధాన్ని స్మరించుకున్న ప్రధాని, దీపావళి రోజున అమర సైనికులకు ఘన నివాళి, మీదే త్యాగనిరతి

పలు దేశాలతో ఇండియాకు ఎన్నో సరిహద్దులు ఉన్నాయని, కానీ ఒకే ఒక్క బోర్డర్ పోస్ట్ గురించి ప్రతి భారతీయుడూ స్మరించుకుంటాడని ప్రధాని మోదీ అన్నారు.  అదే లోంగేవాలా పోస్ట్ అని, ఈ పోస్ట్ గురించి ప్రతివారికీ తెలుసునన్నారు.

  • Umakanth Rao
  • Publish Date - 12:26 pm, Sat, 14 November 20

పలు దేశాలతో ఇండియాకు ఎన్నో సరిహద్దులు ఉన్నాయని, కానీ ఒకే ఒక్క బోర్డర్ పోస్ట్ గురించి ప్రతి భారతీయుడూ స్మరించుకుంటాడని ప్రధాని మోదీ అన్నారు.  అదే లోంగేవాలా పోస్ట్ అని, ఈ పోస్ట్ గురించి ప్రతివారికీ తెలుసునన్నారు. ‘జో బోలే సో నిహాల్, సత్ శ్రీ అకాల్’ అన్న నానుడిని, నినాదాన్ని మనం మరిచిపోలేమన్నారు. రాజస్తాన్ జైసల్మీర్ లోని లోంగేవాలాలో సైనికులతో కలిసి మోదీ దీపావళి పండుగను జరుపుకున్నారు. మన సైనికులపట్ల ప్రతి భారతీయుడూ గర్వపడాలని, మన దేశ సరిహద్దులను చేజిక్కించుకోవాలని చూసే ఏ శక్తినైనా వారు ధైర్యంగా ఎదుర్కొని ఆ యత్నాన్ని వమ్ము చేస్తారని ఆయన చెప్పారు.  హిమాలయాలమీద ఉన్నా, ఎడారుల్లో ఉన్నా, అరణ్యాల్లో లేదా లోతైనసముద్ర జలాల్లో ఉన్నా ప్రతి సవాలునూ ఎదుర్కొనే శక్తి సైనికులకు ఉందని ఆయన పేర్కొన్నారు. మీ సైనికుల ముఖాల్లో సంతోషాన్ని చూసినప్పుడే నాకు నిజమైన దీపావళి అని కూడా మోదీ వ్యాఖ్యానించారు.

1971 లో ఇండో-పాకిస్తాన్ యుధ్ధ సమయంలో ఈ పోస్ట్ వద్దే పాక్ దళాలను భారత దళాలు మట్టి గరపించాయి.