అటల్ టనెల్ ప్రారంభించిన ఘనత మాదే ! ప్రధాని మోదీ

భారత బోర్డర్ మౌలిక సదుపాయాల కల్పనలో 'అటల్ టనెల్' ఈ దేశానికి మరింత పేరు తెస్తుందని ప్రధాని మోదీ అన్నారు. వరల్డ్ క్లాస్ బోర్డర్ కనెక్టివిటీకి ఇది నిదర్శనమని చెప్పారు. సరిహద్దుల బలోపేతానికి ఈ విధమైన ప్రాజెక్టును...

అటల్ టనెల్ ప్రారంభించిన ఘనత మాదే ! ప్రధాని మోదీ
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 03, 2020 | 1:26 PM

భారత బోర్డర్ మౌలిక సదుపాయాల కల్పనలో ‘అటల్ టనెల్’ ఈ దేశానికి మరింత పేరు తెస్తుందని ప్రధాని మోదీ అన్నారు. వరల్డ్ క్లాస్ బోర్డర్ కనెక్టివిటీకి ఇది నిదర్శనమని చెప్పారు. సరిహద్దుల బలోపేతానికి ఈ విధమైన ప్రాజెక్టును చేపట్టాలన్న డిమాండ్ ఎంతో కాలంగా ఉందని, అయితే వివిధ కారణాల వల్ల  జాప్యం జరిగినప్పటికీ నిర్ణీత కాలంలో దీన్ని పూర్తి చేయగలిగామని ఆయన అన్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని రోహ్ తంగ్ లో అతి సుదీర్ఘమైన అటల్ సొరంగ మార్గాన్ని ఆయన శనివారం ప్రారంభించారు.  ఇది దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి కలల స్వప్నమని పేర్కొన్న మోదీ.. చారిత్రాత్మకమైన ఈ రోజున దీన్ని లాంచ్ చేయడం విశేషమన్నారు. అందుకే ఈ సొరంగానికి ఆయన పేరు పెట్టామన్నారు.  ఈ టనెల్ నిర్మాణం వల్ల నాలుగైదు గంటల ప్రయాణకాలం తగ్గుతుందని ఆయన చెప్పారు. హిమాచల్ కే కాక, లడాఖ్ కి కూడా దీనివల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు.

ఈ సొరంగ మార్గం హిమాచల్ లోని   మనాలీని, లడాఖ్ లోని  లాహొల్ స్పితీ లోయను కలుపుతుంది. ఫలితంగా లడాఖ్ లోని లెహ్ కు ప్రయాణ  కాలం  సుమారు నాలుగు గంటలు తగ్గుతుంది. రోజుకు 3 వేల కార్లు, 1500 ట్రక్కులు ప్రయాణించగలిగేలా ఈ సొరంగాన్ని నిర్మించారు. ప్రపంచంలోనే అతి సుదీర్ఘమైనహైవే కన్ స్ట్రక్షన్ గా దీన్ని భావిస్తున్నారు. సముద్ర మట్టానికి దాదాపు 10 వేల అడుగుల ఎత్తున హిమాలయాల లోని పీర్ పంజాల్ సమీపంలో ఉందీ టనెల్. రోహ్ తంగ్ కనుమ కింద ఈ విధమైన సొరంగాన్ని నిర్మించాలని 2000 సంవత్సరం జూన్ 3 న అప్పటి ప్రధాని వాజ్ పేయి నిర్ణయం తీసుకున్నారు. 2002 మే 26 న దీనికి శంకుస్థాపన జరిగింది.

రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్
మహిళా ప్రయాణికురాలిని చితకబాదిన బస్సు కండక్టర్.. వైరల్ వీడియో
మహిళా ప్రయాణికురాలిని చితకబాదిన బస్సు కండక్టర్.. వైరల్ వీడియో
కోటలు దాటేస్తున్న యష్ సినిమా బడ్జెట్.. కారణం ఏంటంటే ??
కోటలు దాటేస్తున్న యష్ సినిమా బడ్జెట్.. కారణం ఏంటంటే ??
శరవేగంగా జరుగుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే
శరవేగంగా జరుగుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే
మెదడులో రక్తస్రావం.. ఈ లక్షణాలతో ముందుగానే గుర్తించవచ్చు..
మెదడులో రక్తస్రావం.. ఈ లక్షణాలతో ముందుగానే గుర్తించవచ్చు..
ముఖేష్ అంబానీతో పెళ్లికి నీతా పెట్టిన కండీషన్ ఏంటో తెలుసా.?
ముఖేష్ అంబానీతో పెళ్లికి నీతా పెట్టిన కండీషన్ ఏంటో తెలుసా.?
కిడ్నీలు లైఫ్ లాంగ్ ఆరోగ్యంగా ఉండాలా.. ఈ ఫుడ్స్ తప్పక తినాల్సిందే
కిడ్నీలు లైఫ్ లాంగ్ ఆరోగ్యంగా ఉండాలా.. ఈ ఫుడ్స్ తప్పక తినాల్సిందే