కేదార్‌ నాథ్ అభివృద్ధి ప్రాజెక్టుపై ప్రధాని దృష్టి

కేదార్‌నాథ్‌ ఆలయ అభివృద్ధి పనులను ప్రధాని మోదీ సమీక్షించారు. ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఆయన వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. కేదార్‌నాథ్ మఠ్ అభివృద్ధి, మందిర పునర్మిర్మాణానికి సంబంధించి తన విజన్‌‌ను ఈ సందర్భంగా ప్రస్తావించారు.

కేదార్‌ నాథ్ అభివృద్ధి ప్రాజెక్టుపై ప్రధాని దృష్టి
Follow us

| Edited By:

Updated on: Jun 10, 2020 | 7:06 PM

కేదార్‌నాథ్‌ ఆలయ అభివృద్ధి పనులను ప్రధాని మోదీ సమీక్షించారు. ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఆయన వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. కేదార్‌నాథ్ మఠ్ అభివృద్ధి, మందిర పునర్మిర్మాణానికి సంబంధించి తన విజన్‌‌ను ఈ సందర్భంగా ప్రస్తావించారు. కాలపరీక్షకు నిలిచే విధంగా, ఎకో-ఫ్రెండ్లీ తీరులో ప్రాజెక్టు రూపకల్పన ఉండాలని సూచించారు. కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ లాంటి ఆలయాల అభివృద్ధి కోసం కూడా ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. జమ్మూకశ్మీర్‌లోని రామ్‌బన్ నుంచి కేదారినాథ్ వరకూ వెళ్లే మార్గంలో వున్న వారసత్వ, మతపరమైన ప్రదేశాలను కూడా మరింత అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాలని ప్రధాని సూచించారు. బ్రహ్మ కమల వాటిక, టౌన్‌ క్వార్టర్స్‌ అభివృద్ధి, మ్యూజియం, వాసుకీ తాల్‌ లాంటి వాటి గురించి కూడా ప్రధాని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో పర్యాటకులు, యాత్రికుల రద్దీ లేనందున పెండింగ్ లో వున్న నిర్మాణ పనులను పూర్తి పూర్తి చేసేందుకు ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. పనులు జరుగుతున్నప్పుడు కార్మికులు భౌతిక దూరం నిబంధనలు పాటించాలని కోరారు. కేదార్‌నాథ్‌కు తగిన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా రాబోయే కాలంలో మరింత మంది పర్యాటకులను ఆకర్షించేందుకు వీలుంటుందని ప్రధాని మోదీ అన్నారు. ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.