మీకో విషయం తెలుసా.. 28 ఏళ్ల తర్వాత అక్కడికి ప్రధాని మోడీ

అప్పుడు ఆయన ఓ ఉద్యమ నాయకుడు.. ఇప్పుడు ఆయనే దేశానికి ప్రధాని… అతనే ప్రధాని నరేంద్ర దామోదర్‌దాస్ మోడీ. అవును ఇది నిజం.. సరిగ్గా 28 ఏళ్ల క్రితం రాముడు పుట్టిన అయోధ్యలో ఆయన అడుగు పెట్టారు… రామ్ లల్లాను దర్శించుకున్నారు. అప్పుడు ఆయన అన్న మాటలే నిజమయ్యాయి. తాను ఆలయం నిర్మించే సమయంలో మరోసారి వస్తానని చెప్పారు. అప్పుడు మోడీ ఇచ్చిన మాట ప్రకారం.. రాముడి గుడి భూమి పూజకు ఆయన రాబోతున్నారు. సరిగ్గా 28 […]

మీకో విషయం తెలుసా.. 28 ఏళ్ల తర్వాత అక్కడికి ప్రధాని మోడీ
Follow us

|

Updated on: Aug 02, 2020 | 10:20 AM

అప్పుడు ఆయన ఓ ఉద్యమ నాయకుడు.. ఇప్పుడు ఆయనే దేశానికి ప్రధాని… అతనే ప్రధాని నరేంద్ర దామోదర్‌దాస్ మోడీ. అవును ఇది నిజం.. సరిగ్గా 28 ఏళ్ల క్రితం రాముడు పుట్టిన అయోధ్యలో ఆయన అడుగు పెట్టారు… రామ్ లల్లాను దర్శించుకున్నారు. అప్పుడు ఆయన అన్న మాటలే నిజమయ్యాయి. తాను ఆలయం నిర్మించే సమయంలో మరోసారి వస్తానని చెప్పారు. అప్పుడు మోడీ ఇచ్చిన మాట ప్రకారం.. రాముడి గుడి భూమి పూజకు ఆయన రాబోతున్నారు.

సరిగ్గా 28 ఏండ్ల తర్వాత రెండోసారి ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యకు వస్తున్నారు. 1992 లో జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 ను రద్దు చేయాలంటూ కన్యాకుమారి నుంచి నరేంద్ర మోడీ ‘తిరంగాయాత్ర’ను ప్రారంభించారు. అక్కడి నుంచి వివిధ రాష్ట్రాల మీదుగా యాత్రను కొనసాగించిన మోడీ.. జనవరి 18న ఉత్తరప్రదేశ్ చేరుకున్నారు.

ఫైజాబాద్ సమీపంలోని ఓ మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆనాటి బీజేపీ అధ్యక్షుడు మురళీమనోహర్ జోషి హాజరయ్యారు. ఆ మరుసటి రోజు మరళీమనోహర్ జోషితో కలిసి అయోధ్యలోని బాల రాముడిని దర్శించుకున్నారు. అప్పుడు పత్రికా ప్రముఖులతో మాట్లాడుతూ ఇలా అన్నారట..  “శ్రీరాముడి ఆలయం నిర్మించే సమయంలో మరోసారి అయోధ్య వస్తాను” అని. అదే నిజమైంది.

28 ఏండ్ల క్రితం చెప్పినట్లుగానే ఆలయం నిర్మాణ పనులను ప్రారంభించేందుకు రెండో సారి అయోధ్యకు మోడీ వస్తున్నారని, నిజంగా ఇది నమ్మశక్యంగా లేదంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ మహేంద్ర త్రిపాఠి. ఆ రోజు జోషితో కలిసి ఉన్న మోడీ ఫొటోను మీడియా మిత్రులతో పంచుకున్నారు.