Breaking News
  • సికింద్రాబాద్‌-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు. డిసెంబర్‌ 1,8,15,22,29 తేదీల్లో నడవనున్న ప్రత్యేక రైళ్లు. మచిలీపట్నంలో మధ్యాహ్నం 2:25కి బయల్దేరి.. రాత్రి 10:10కి సికింద్రాబాద్‌కు చేరుకోనున్న ప్రత్యేక రైలు. అదేరోజు సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 11:55కి బయల్దేరి.. మరుసటి రోజు ఉ.8:55కి మచిలీపట్నం చేరుకోనున్న ప్రత్యేక రైలు.
  • ఏపీకి నెంబర్లు కేటాయించిన కేంద్రం. అక్రమ మైనింగ్‌, అనధికార మద్యం అమ్మకాలపై.. ఫిర్యాదులకు నెంబర్లు కేటాయించిన కేంద్ర సర్కార్‌. అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు కోసం 14400 నెంబర్‌.. అనధికార మద్యంపై ఫిర్యాదుకు 14500 నెంబర్‌ కేటాయింపు.
  • మళ్లీ పెరిగిన బంగారం ధరలు. పెళ్లిళ్ల సీజన్‌ కొనుగోళ్లతో పెరిగిన పసిడి ధరలు. 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై రూ.225 పెంపు. రూ.38,715 పలుకుతున్న 10గ్రాముల బంగారం. రూ.440 పెరిగి రూ.45,480కి చేరిన కిలో వెండి ధర.
  • ఛండీగడ్‌: 2019 ప్రపంచ కబడ్డీ కప్‌కు పంజాబ్ ఆతిథ్యం. డిసెంబర్‌ 1 నుంచి 9 వరకు మ్యాచ్‌ల నిర్వహణ. సుల్తాన్‌పూర్‌ లోధిలోని గురునానక్‌ స్టేడియంలో ప్రారంభ వేడుక. ప్రపంచ కబడ్డీ టోర్నీలో పాల్గొననున్న భారత్, అమెరికా, శ్రీలంక.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెన్యా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, కెనడా జట్లు.
  • ఓటర్ల జాబితా సవరణకు కొత్త షెడ్యూల్‌ విడుదల. జనవరి 1, 2020 అర్హత తేదీతో ఓటర్ల జాబితా సవరణ. ఓటర్ల వివరాల పరిశీలనకు ఈనెల 30 తుది గడువు. డిసెంబర్‌ 16న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ. 2020, జనవరి 15న అభ్యంతరాలు, వినతుల స్వీకరణ.
  • టిక్‌టాక్‌కు పోటీగా త్వరలో ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌. రీల్స్‌ పేరిట ఓ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఎక్స్‌ప్లోర్‌ సెక్షన్‌లో కొత్త ఫీచర్. కొత్త ఫీచర్‌లో టిక్‌టాక్ మాదిరిగా వీడియోలు క్రియేట్‌ చేసే సౌకర్యం.

జిన్‌పింగ్‌కు గిప్టులుగా భారతీయ కళాఖండాలు..అవేంటో తెలుసా?

పెచ్చరిల్లుతున్న విపరీత, తీవ్రవాద ధోరణులు రెండు దేశాలకూ ప్రమాదకరమేనని, వీటిని సంయుక్తంగా ఎదుర్కొందామని భారత్‌, చైనా నిర్ణయించాయి. భారత పర్యటనకు వచ్చిన చైనా అధినేత జిన్‌పింగ్‌కు ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి మహాబలిపురంలోని సముద్రతీర రిసార్టులో ప్రైవేటు విందు ఇచ్చారు. దాదాపు రెండున్నర గంటల సేపు విందు సమావేశం సాగింది. ఇద్దరు నేతలూ వివిధాంశాలపై పరస్పరం అభిప్రాయాలను తెలియజేసుకున్నారు.

ఇక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు అదిరిపోయే కానుకలు ఇవ్వనున్నారు. వీరిద్దరి మధ్య అధికారిక లాంఛనాలకు దూరంగా సమావేశం జరుగుతున్న విషయం తెలిసిందే. మహాబలిపురం వేదికగా వీరి భేటీ జరుగుతోంది. ఈ సందర్భంగా జిన్‌పింగ్‌కు ప్రధానిమోదీ మంచి కానుకలు సిద్ధం చేశారు. భారతీయ సంప్రదాయం ఉట్టిపడే విధంగా ఉండే మన దేశ కళాకృతులను జిన్‌పింగ్‌కు బహుమతిగా ఇవ్వనున్నారు. ఆరు అడుగులు ఎత్తుండే దీపపు స్తంభాలు, మూడు అడుగుల ఎత్తుండే తంజావూరు పెయింటింగ్‌లను కానుకగా ఇస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి.

తమిళనాడు హస్తకళా నైపుణ్యాన్ని కళ్లకు కట్టేలా ఇవి ఉండనున్నాయి. బంగారం పూత పూసిన ఇత్తడి దీపపు స్తంభాలు రెండు కలిసి 108 కేజీల బరువు ఉంటాయి. వీటిని తయారు చేయడానికి 12 రోజులు పట్టిందట. సరస్వతి దేవి నృత్యం చేస్తున్న భంగిమలో గీసిన చిత్రలేఖనం మూడు అడుగుల పొడవు, నాలుగు అడుగుల వెడల్పు ఉంటుంది. దీన్ని తయారు చేయడానికి 45 రోజులు పట్టిందట. మరోవైపు ప్రధాని మోదీ కోసం జిన్‌పింగ్‌ కూడా ఓ కానుకను తెచ్చారట. అదేంటో మాత్రం బయటకు వెల్లడించలేదు.