పారిశుద్ధ్య కార్మికులకు మోదీ రూ.21లక్షల విరాళం

దిల్లీ: కుంభమేళాలో పారిశుద్ధ్య కార్మికుల కృషికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చిన విషయం తెలిసిందే. వారి పాదాలను కడిగి ప్రధాని మోదీ వారిని గౌరవించారు. ఆ కార్మికులను కర్మయోగిలుగా అభివర్ణించారు. తాజాగా మోదీ తన వ్యక్తిగత ఖాతా నుంచి రూ.21లక్షలు కుంభమేళా పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమ నిధికి విరాళంగా ఇచ్చారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం ట్విటర్‌ ద్వారా ప్రకటించింది. గతంలో పలు సందర్భాల్లో ఇచ్చిన విరాళాలను అందులో ప్రస్తావించారు. వాటికి కొనసాగింపుగా ఇది తాజా నిర్ణయం అని […]

పారిశుద్ధ్య కార్మికులకు మోదీ రూ.21లక్షల విరాళం
Follow us

|

Updated on: Mar 06, 2019 | 4:44 PM

దిల్లీ: కుంభమేళాలో పారిశుద్ధ్య కార్మికుల కృషికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చిన విషయం తెలిసిందే. వారి పాదాలను కడిగి ప్రధాని మోదీ వారిని గౌరవించారు. ఆ కార్మికులను కర్మయోగిలుగా అభివర్ణించారు. తాజాగా మోదీ తన వ్యక్తిగత ఖాతా నుంచి రూ.21లక్షలు కుంభమేళా పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమ నిధికి విరాళంగా ఇచ్చారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం ట్విటర్‌ ద్వారా ప్రకటించింది. గతంలో పలు సందర్భాల్లో ఇచ్చిన విరాళాలను అందులో ప్రస్తావించారు. వాటికి కొనసాగింపుగా ఇది తాజా నిర్ణయం అని తెలిపారు.

ఇటీవల సియోల్‌ శాంతి పురస్కారం కింద లభించిన రూ1.3కోట్లను ‘నమామి గంగ’ పథకానికి విరాళంగా ఇచ్చిన విషయం తెలిసందే. తనకు అందిన బహుమతులను వేలం వేయగా వచ్చిన రూ.3.40కోట్లను సైతం నమామి గంగకు ఇచ్చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రూ.21లక్షలు గుజరాత్‌ ఉద్యోగుల ఆడపిల్లల చదువు కోసం విరాళంగా ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో లభించిన బహుమతులను వేలం వేయగా వచ్చిన రూ.89.96 కోట్ల సొమ్మును సైతం ఆడపిల్లల చదువు కోసం ఏర్పాటు చేసిన ‘కన్యా కేలవని నిధి’కి ఇచ్చేశారు.