‘చైనా అకౌంట్’‌ని డిలీట్ చేసిన మోదీ

సరిహద్దుల్లో తరచుగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు చెక్‌ పెట్టేందుకు భారత ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

'చైనా అకౌంట్'‌ని డిలీట్ చేసిన మోదీ
Follow us

| Edited By:

Updated on: Jul 02, 2020 | 10:09 AM

సరిహద్దుల్లో తరచుగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు చెక్‌ పెట్టేందుకు భారత ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే చైనాకు చెందిన పలు కంపెనీలతో తెగదెంపులు చేసుకున్న భారత ప్రభుత్వం, ఆ దేశానికి చెందిన 59 యాప్‌లను కూడా నిషేధించింది. ఈ నేపథ్యంలో  చైనా సామాజిక మాధ్యమమైన సినా వీబోను వీడాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారు.  దీనికి సంబంధించిన అధికారిక ప్రక్రియ బుధవారం మొదలైంది.

కాగా చైనా ట్విట్టర్‌గా పిలిచే వీబోలో ఉండే అకౌంట్‌ని మూసేయడం కాస్త క్లిష్టంతో కూడుకున్న పనే. తమ అకౌంట్‌ని డీయాక్ట్‌వేట్‌ చేయడానికి వీబో నుంచి అనుమతులు తీసుకోవాలని. ఒక్కోసారి ఈ ప్రక్రియ ఆలస్యం అవ్వొచ్చు. ఈ నేపథ్యంలో మోదీ అకౌంట్‌లోని ఫొటోను, పోస్టులు, కామెంట్లను తొలగించారు. కాగా కొన్నేళ్ల క్రితం వీబోలో ప్రధాని మోదీ అకౌంట్‌ను క్రియేట్‌ చేసుకున్నారు. అందులో ఇప్పటివరకు మోదీ 115 పోస్టులను చేయగా.. 113ను తొలగించారు. మిగిలిన రెండింటిలో మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ కలిసి ఉన్న ఫొటోలు ఉన్నాయి. వీబోలో చైనా అధ్యక్షుడు ఉన్న ఫొటోలను తొలగించడం కష్టం కూడుకున్నది కావడంతో.. ఆ రెండింటిని వదిలేశారు. ఇక వీబోలో మోదీ అకౌంట్‌కి 2,44,000మంది ఫాలోవర్లు ఉండగా.. పోస్టులను డిలీట్ చేసినప్పటికీ, ఫాలోవర్ల సంఖ్య తగ్గలేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..