వైఎస్ జగన్‌కు తెలుగులో విషెస్ చెప్పిన మోదీ

Pm modi congratulates ys jagan mohan reddy over election results, వైఎస్ జగన్‌కు తెలుగులో విషెస్ చెప్పిన మోదీ

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీకి, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా తెలుగులో అభినందనలు చెప్పారు. ప్రియమైన వైఎస్ జగన్, ఆంధ్ర ప్రదేశ్‌లో ఘన విజయాన్ని సాధించినందుకు అభినందనలు. మీ పదవీ కాలం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. మీకు ఇవే శుభాకాంక్షలు అంటూ మోదీ ట్వీట్ చేశారు.

ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీపీ ప్రభంజనం సృష్టిస్తూ భారీ విజయం దిశగా దూసుకువెళ్తోంది. కాగా ఇప్పటికే 30 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా.. మరో 123 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *