మహాబలిపురంలో చైనా అధినేత పర్యటన.. షెడ్యూల్ ఖరారు

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ భారత్‌ పర్యటన ఖరారైంది. అక్టోబర్ 11, 12 తేదీల్లో ఆయన ప్రధాని మోదీతో కలిసి తమిళనాడులో పర్యటించనున్నారు. చెన్నై సమీపంలోని కాంచీపురంలో జిల్లాలో ఉన్న మహాబలిపురాన్ని సందర్శించనున్నారు. ఇరు దేశాధినేతలు అక్కడ పలు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఎన్నడూ లేని విధంగా దక్షిణాది రాష్ట్రంలో దేశాధినేతలు చర్చలు జరపడం ఆసక్తిగా మారింది.  ఎల్లుండి నుంచి జరగునున్న ఈ చర్చలకు మహాబలిపురం ప్రాంత సరికొత్త కళను సంతరించుకుంది. ఎక్కడికక్కడే  సుందరంగా తీర్చి […]

మహాబలిపురంలో చైనా అధినేత పర్యటన.. షెడ్యూల్ ఖరారు
Follow us

| Edited By: Srinu

Updated on: Oct 09, 2019 | 5:34 PM

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ భారత్‌ పర్యటన ఖరారైంది. అక్టోబర్ 11, 12 తేదీల్లో ఆయన ప్రధాని మోదీతో కలిసి తమిళనాడులో పర్యటించనున్నారు. చెన్నై సమీపంలోని కాంచీపురంలో జిల్లాలో ఉన్న మహాబలిపురాన్ని సందర్శించనున్నారు. ఇరు దేశాధినేతలు అక్కడ పలు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఎన్నడూ లేని విధంగా దక్షిణాది రాష్ట్రంలో దేశాధినేతలు చర్చలు జరపడం ఆసక్తిగా మారింది.  ఎల్లుండి నుంచి జరగునున్న ఈ చర్చలకు మహాబలిపురం ప్రాంత సరికొత్త కళను సంతరించుకుంది. ఎక్కడికక్కడే  సుందరంగా తీర్చి దిద్దారు. చైనా అధ్యక్షుని రాక సందర్భంగా కేంద్ర, రాష్ట్ర నిఘా విభాగానికి చెందిన అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. గత ఏడాది ప్రధాని మోదీ చైనా పర్యటన జరిపిన సందర్భంగా ఆయనను భారత్‌కు ఆహ్వానించారు. ప్రస్తుతం భారత్ ఎదుర్కొంటున్న సీమాంతర ఉగ్రవాదంతో పాటు,  పరిశ్రమల స్ధాపన, పెట్టుబడులపై ప్రధానంగా  చర్చలు జరిగే అవకాశాలున్నాయి.