నిరుద్యోగ నిర్మూలనకు కేబినెట్ కమిటీ..!

దేశంలో పెరుగుపోతున్న నిరుద్యోగ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఏకంగా 10 మంది కేంద్ర మంత్రులతో ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధి పేరిట కేబినెట్ కమిటీని ఏర్పాటు చేశారు. 45 ఏళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో నిరుద్యోగ సమస్య పెరిగిందని, మోదీ. అధికారికంగా మే 31న విడుదలైన గణాంకాల్లో 6.1 శాతం నిరుద్యోగం పెరిగిందని మోదీ తెలిపారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే సమావేశంలో మంత్రులు అమిత్‌ షా, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, […]

నిరుద్యోగ నిర్మూలనకు కేబినెట్ కమిటీ..!
Follow us

| Edited By: Srinu

Updated on: Jun 06, 2019 | 4:22 PM

దేశంలో పెరుగుపోతున్న నిరుద్యోగ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఏకంగా 10 మంది కేంద్ర మంత్రులతో ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధి పేరిట కేబినెట్ కమిటీని ఏర్పాటు చేశారు. 45 ఏళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో నిరుద్యోగ సమస్య పెరిగిందని, మోదీ. అధికారికంగా మే 31న విడుదలైన గణాంకాల్లో 6.1 శాతం నిరుద్యోగం పెరిగిందని మోదీ తెలిపారు.

ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే సమావేశంలో మంత్రులు అమిత్‌ షా, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, నరేంద్ర సింగ్ తోమర్, రమేష్ పోఖ్రియాల్, ధర్మేంద్ర ప్రధాన్, మహేంద్రనాథ్ పాండే, సహాయ మంత్రులు సంతోష్ కుమార్ గంగ్వార్, హార్దిప్ సింగ్ సభ్యులు పాల్గొననున్నారు.

కాగా.. బొగ్గు, క్రూడ్ ఆయిల్, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్తు రంగాల్లో నమోదైన అల్పవృద్ధి రేటు వీటిని దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులు, అభివృద్ధి తద్వారా ఉపాధి కల్పనపై దృష్టి పెట్టింది మోదీ సర్కారు.