ప్రధాని మోదీ, అమిత్ షా ప్రెస్ మీట్ లైవ్

లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ చారీత్రాత్మక విజయం దిశగా దూసుపోతోంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు: 130 కోట్ల మంది ప్రజలకు తలవంచి నమస్కరిస్తున్నా కోట్ల మంది ప్రజలు ఈ పకీరు జోలెను నింపారు ఈ ఎన్నికల్లో ప్రజలే గెలిచారు స్వాతంత్య్రం తర్వాత ఎక్కువ మంది ఈ ఎన్నికల్లోనే ఓటేశారు ప్రజాస్వామ్యం కోసం బీజేపీ కార్యకర్తలు ప్రాణత్యాగం చేశారు ఎన్నికల కమీషన్‌ను అభినందిస్తున్నా 130 […]

ప్రధాని మోదీ, అమిత్ షా ప్రెస్ మీట్ లైవ్
Follow us

|

Updated on: May 23, 2019 | 8:23 PM

లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ చారీత్రాత్మక విజయం దిశగా దూసుపోతోంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మీడియాతో మాట్లాడారు.

ప్రధాని మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

130 కోట్ల మంది ప్రజలకు తలవంచి నమస్కరిస్తున్నా

కోట్ల మంది ప్రజలు ఈ పకీరు జోలెను నింపారు

ఈ ఎన్నికల్లో ప్రజలే గెలిచారు

స్వాతంత్య్రం తర్వాత ఎక్కువ మంది ఈ ఎన్నికల్లోనే ఓటేశారు

ప్రజాస్వామ్యం కోసం బీజేపీ కార్యకర్తలు ప్రాణత్యాగం చేశారు

ఎన్నికల కమీషన్‌ను అభినందిస్తున్నా

130 కోట్ల మంది శ్రీకృష్ణుడి రూపంలో దేశం కోసం నిలబడ్డారు

దేశప్రజల భావన..రేపటి ఉజ్వల భవిష్యత్‌కు నాంది

గెలుపును వినమ్రంగా ప్రజల పాదాలకు సమర్పిస్తున్నా

విజేతలందరికి శుభాకాంక్షలు

ఏ పార్టీ నుంచి గెలిచినా భుజం, భుజం కలిపి దేశ భవిష్యత్ కోసం పనిచేద్దాం

రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలకు సహకరిస్తాం

బీజేపీ కార్యకర్తల శ్రమ నాకు గర్వం కల్గిస్తోంది

అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వారికి శుభాకాంక్షలు

అమితా షా ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు

ఎన్నికల్లో కార్యకర్తల శ్రమ మరవలేనిది

దేశ ప్రజలు అద్భుతమైన విజయాన్ని కట్టబెట్టారు

ప్రజలు విపక్షాలను తిరస్కరించారు

ఎగ్జిట్ పార్టీలు నిజం కాబోవని కుటుంబ పార్టీలు భావించాయి

బీజేపీ విజయం చరిత్రను తిరగరాసింది

అనేక రాష్ట్రాల్లో 50 శాతానికి పైగా సీట్లు సాధించాం

50 ఏళ్ల తర్వాత వరసగా రెండుసార్లు పూర్తి మెజారిటీ వచ్చింది

17 రాష్ట్రాలలో కాంగ్రెస్‌కు 0 సీట్లు

50 ఏళ్లుగా కాంగ్రెస్‌వి వంశావాద, కుల, బుజ్జగింపు రాజకీయాలు

యూపీలో ఎస్పీ-బీఎపస్పీ కూటమి కట్టినా 60 సీట్లు పైగా బీజేపీ గెలిచింది

భవిష్యత్‌లో కుటుంబ పార్టీలకు చోటు ఉండదు

ఎగ్జిట్ పోల్స్ కంటే ఎక్కువ సీట్లు వచ్చాయి

ఢిల్లీలో చక్కర్లు కొట్టిన చంద్రబాబు ఓడిపోయారు

జగన్మోహన్‌ రెడ్డి, నవీన్ పట్నాయక్, పవన్ చామ్లింగ్‌లకు శుభాకాంక్షలు

అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ మొదటిసారి పూర్తి మెజారిటీ సాధించింది

బెంగాల్‌లో రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది

మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్‌ లలో కాంగ్రెస్ గెలిచినా బీజేపీ ఓడలేదు

70 ఏళ్లలో చేయలేని అభివృద్ధిని 5 ఏళ్లలో మోదీ చేసి చూపించారు

మోదీ విధానాలను ప్రజలు ఆశీర్వధించారు