Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 98 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. 2 లక్షలకు చేరువ లో కరోనా కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 198706. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 97581. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 95526. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 5598. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • "తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నా సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో తమ ప్రాణాలను అర్పించిన అమర వీరుల స్ఫూర్తి మరువలేనిది"- కేంద్ర సహాయక హోంమంత్రి జి.కిషన్ రెడ్డి
  • చెన్నై : తమిళనాడు లో రుతుపవనాల ప్రభావం తో భారీ గా కురుస్తున్న వర్షాలు . తిరువళ్లూరు,కాంచీపురం జిల్లాలతో పాటు వెల్లూర్ ,విరుదునగర్,నీలగిరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు . పలు చోట్ల రోడ్లన్నీ జలమయం ,ఉరుములు తో కూడిన వర్షాలకు పలు చోట్ల నేలకొరిగిన చెట్లు . తిరువళ్లూరు జిల్లాలో పిడుగుపాటు కి ఒక మహిళ మృతి.
  • టిటిడి : తిరుమలలో శ్రీవారి దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. టిటిడి ఉద్యోగాలు, స్థానికులతో ట్రయల్ రన్ నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి. 6 అడుగుల భౌతిక దూరం పాటిస్తూ దర్శనం కల్పించాలని సూచన. టీటీడీ ఈవో లేఖకు స్పందించిన ఏపీ ప్రభుత్వం. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జే.ఎస్.వి ప్రసాద్.
  • ఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ కార్యాలయంలో కరోనా పాజిటివ్. దాదాపు 13 మంది వ్యక్తులకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరించిన అధికారులు లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం.
  • టీవీ9 తో ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ శిశి కళ . ఉస్మానియా మెడికల్ కాలేజీ లో 12 మందికి కోవిడ్ పాజిటివ్. భయం గుప్పెట్లో ఉస్మానియా పీజీలు. ఇప్పటికే రిడింగ్ రూమ్ ను మోసివేసిన కాలేజ్ యాజమాన్యం. ప్రతి ఒక్క పీజీ ని ppe కిట్స్ వెస్కొమని సూచిస్తున్న ప్రిన్సిపల్ శశికళ. జూనియర్ డాక్టర్స్ కు పాజిటివ్ రావటం తో హాస్టల్ ను శానిటేషన్ చేసిన ghmc.

నేడు ఐక్యరాజ్యసమితిలో ప్రధాని మోదీ ప్రసంగం!

PM Likely to Skip Pakistan Mention Focus on Development, నేడు ఐక్యరాజ్యసమితిలో ప్రధాని మోదీ ప్రసంగం!

న్యూయార్క్ లోని  ఐక్యరాజ్యసమితి సమావేశంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ప్రసంగించనున్నారు. 74వ ఐక్యరాజ్యసమితి సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగం హైలైట్ కానుంది. న్యూయార్క్‌లోని ఐరాస కేంద్ర కార్యాలయంలో రాత్రి 8-9 గంటల మధ్య (భారతీయ కాలమానం) నరేంద్ర మోదీ ప్రసంగం కొనసాగే అవకాశం ఉంది. 2014లో తొలిసారి ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించారు మోదీ. ఇవాళ రెండోసారి ప్రసంగించనున్నారు. నేడు ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించేవారి జాబితాలో నరేంద్ర మోదీ నాలుగో స్థానంలో ఉన్నారు. మోదీ తర్వాత కొద్దిసేపటికి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రసంగిస్తారు. ఈ 74వ సమావేశాలు సెప్టెంబర్ 24 నుంచి సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతున్నాయి. దేశంలో పేదరిక నిర్మూలనకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న పోరు, పర్యావరణ పరిరక్షణ కోసం చేపడుతున్న చర్యలపై ప్రధాని మోదీ ఐక్యరాజ్యసమితిలో వివరిస్తారు. పాకిస్తాన్ గడ్డ మీద నుంచి ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న విషయాన్ని కూడా ప్రధాని ఐక్యరాజ్యసమితి సాక్షిగా హైలైట్ చేయనున్నారు.

జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత దీనిపై పాకిస్తాన్ రాద్ధాంతం చేస్తోంది. ప్రపంచ దేశాల ముందు భారత్ ఏదో తప్పు చేసినట్టుగా చూపించే ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి సమయంలో పాకిస్తాన్‌కు దీటుగా సమాధానం చెప్పడానికి ప్రధాన మోదీ ఈ సమావేశాన్ని అద్భుతంగా వినియోగించుకోనున్నారు.

Related Tags